logo

ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడాలి

పోలీసుస్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడాలని, మహిళలు, బాలికలకు సహాయపడేందుకు రిసెప్షన్‌ నందు మహిళా పోలీసులను ఉంచాలని, మహిళల రక్షణకు ప్రాధ్యానం ఇవ్వాలని కాకినాడ జిల్లా ఎస్పీ ఎం.రవీంద్రనాథ్‌బాబు సూచించారు.

Published : 26 Mar 2023 03:23 IST

ప్రతిభ కనబరిచిన మహిళా పోలీసులతో ఎస్పీ, అధికారులు

మసీదు సెంటర్‌ (కాకినాడ): పోలీసుస్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడాలని, మహిళలు, బాలికలకు సహాయపడేందుకు రిసెప్షన్‌ నందు మహిళా పోలీసులను ఉంచాలని, మహిళల రక్షణకు ప్రాధ్యానం ఇవ్వాలని కాకినాడ జిల్లా ఎస్పీ ఎం.రవీంద్రనాథ్‌బాబు సూచించారు. శనివారం కాకినాడలోని జిల్లా పోలీసు కార్యాలయ సమావేశ మందిరంలో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న కేసులను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. సైబర్‌, ఆన్‌లైన్‌ మోసాలపై ప్రతి పోలీసు అధికారి అవగాహన కలిగి ఉండాలని, వీటిపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ప్రత్యేక కార్యాచరణ, రాత్రిపూట గస్తీ పెంచి దొంగతనాలు జరగకుండా చూడాలన్నారు. ఎల్‌హెచ్‌ఎంఎస్‌పై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. సీసీ కెమెరాలు అన్ని చోట్ల ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. పోలీసుస్టేషన్‌ పరిధిలో విధులు నిర్వహిస్తూ జనవరి నుంచి మార్చి వరకు ప్రతిభ కనబరిచిన మహిళా పోలీసులకు ప్రశంసా పత్రాలు, నగదు ప్రోత్సాహకాలను ఎస్పీ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ పి.శ్రీనివాస్‌, డీఎస్పీలు అంబికాప్రసాద్‌, మురళీకృష్ణారెడ్డి, మురళీమోహన్‌, వెంకటేశ్వరరావు, సీఐలు, ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని