logo

మహిళల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా పథకాలు

స్వయం సహాయక సంఘాల ద్వారా గ్రామీణ మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోందని కలెక్టర్‌ హిమాన్షుశుక్లా తెలిపారు.

Published : 26 Mar 2023 03:47 IST

లబ్ధిదారులకు చెక్కు అందిస్తున్న కలెక్టర్‌ హిమాన్షుశుక్లా, అధికారులు

అమలాపురం కలెక్టరేట్‌: స్వయం సహాయక సంఘాల ద్వారా గ్రామీణ మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోందని కలెక్టర్‌ హిమాన్షుశుక్లా తెలిపారు. పథకాలను వినియోగించుకుని మహిళలు ఆర్థిక ప్రగతి సాధించి, పేదరికాన్ని జయించాలన్నారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఏలూరు జిల్లా దెందులూరు నుంచి వైఎస్‌ఆర్‌ ఆసరా పథకానికి సంబంధించిన మూడో విడత నిధులను శనివారం లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమచేశారు. ఈ సందర్భంగా కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో పలువురు నాయకులు, ఆధికారులు పాల్గొన్నారు. కలెక్టర్‌ మాట్లాడుతూ 2019 ఏప్రిల్‌ 11నాటికి డ్వాక్రా సంఘాలకున్న బ్యాంకు రుణాల బకాయిలను నాలుగు విడతల్లో లబ్ధిదారులకు అందజేయడం జరుగుతుందన్నారు. మూడో విడత రుణమాఫీలో భాగంగా శనివారం జిల్లావ్యాప్తంగా 31,029 సంఘాలకు చెందిన 2.97 లక్షల మందికి రూ.253.76 కోట్లు ఖాతాల్లో జమయ్యాయన్నారు. బాలమునికుమారి, సత్యనాగేంద్రమణి, శివశంకరప్రసాద్‌, అబ్దుల్‌ఖాదర్‌, అయ్యప్పనాయుడు, భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని