logo

నూతన పరిశోధనలకు టెక్‌ఫెస్ట్‌లు దోహదం

టెక్‌ఫెస్ట్‌ల ద్వారా విద్యార్థులు సాంకేతిక విజ్ఞానాన్ని మెరుగుపర్చుకుని సమాజానికి ఉపయోగపడే నూతన ఆవిష్కరణలకు నాంది పలకాలని జేఎన్‌టీయూకే రెక్టార్‌ ఆచార్య కేవీ రమణ సూచించారు.

Published : 26 Mar 2023 03:47 IST

జేఎన్‌టీయూకే బృందం ఆధ్వర్యంలో సావనీర్‌ విడుదల

వెంకట్‌నగర్‌ (కాకినాడ), న్యూస్‌టుడే: టెక్‌ఫెస్ట్‌ల ద్వారా విద్యార్థులు సాంకేతిక విజ్ఞానాన్ని మెరుగుపర్చుకుని సమాజానికి ఉపయోగపడే నూతన ఆవిష్కరణలకు నాంది పలకాలని జేఎన్‌టీయూకే రెక్టార్‌ ఆచార్య కేవీ రమణ సూచించారు. వర్సిటీ డిజైన్‌ ఇన్నోవేషన్‌ సహకారంతో జాతీయస్థాయి సింపోజియం టెక్‌ఫెస్ట్‌ను వర్సిటీలోని అలూమ్ని ఆడిటోరియంలో శనివారం నిర్వహించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ నూతన ఆవిష్కరణలు, వినూత్న పరిశోధనలు, స్టార్టప్‌లకు టెక్‌ఫెస్ట్‌లు వేదికగా నిలుస్తాయన్నారు. యూసీఈకే ప్రిన్సిపల్‌ ఎం.హెచ్‌.ఎం.కృష్ణప్రసాద్‌ మాట్లాడుతూ సమాజంలోని సమస్యలకు తమ ఆవిష్కరణల ద్వారా విద్యార్థులు పరిష్కారం చూపాలని సూచించారు. సీఈ ఫెస్ట్‌ను సౌధా-2కే23, సీఎస్‌ఈ ఫెస్ట్‌ను జైగెస్ట్‌-2కే23, పీఈపీసీఈ ఫెస్ట్‌ను ఇంధన్‌-2కే23గా ఏర్పాటు చేశారన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ ఆచార్య ఎల్‌.సుమలత, ఓఎస్‌డీ ఆచార్య కోటేశ్వరరావు, విభాగాధిపతులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని