logo

ఏళ్లుగా పద్దులు ఊసేది..?

ఏళ్లుగా ఆడిట్‌కు పద్దులు సమర్పించకపోవడాన్ని కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిట్‌ జనరల్‌ (కాగ్‌) తప్పు పట్టింది. 2022 మార్చి 31తో ముగిసిన సంవత్సరానికి రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై కాగ్‌ ఆడిట్‌ నివేదిక విడుదల చేసింది.

Published : 26 Mar 2023 05:03 IST

ఈనాడు, కాకినాడ: ఏళ్లుగా ఆడిట్‌కు పద్దులు సమర్పించకపోవడాన్ని కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిట్‌ జనరల్‌ (కాగ్‌) తప్పు పట్టింది. 2022 మార్చి 31తో ముగిసిన సంవత్సరానికి రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై కాగ్‌ ఆడిట్‌ నివేదిక విడుదల చేసింది. అందులో 2022 ఆగస్టు నాటికి ఆడిట్‌కు సమర్పించాల్సిన పద్దుల సంఖ్యను ప్రస్తావించింది. ఆడిట్‌కు పద్దులు సమర్పించని ప్రభుత్వరంగ సంస్థలు.. అథారిటీలు/ సంస్థల వివరాలను.. సమర్పించాల్సిన పద్దుల సంవత్సరాలను నివేదికలో వెల్లడించింది.

చాంతాడంత చిట్టా..

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఆడిట్‌కు పద్దులు సమర్పించని సంస్థలు/ అథారిటీలు బోలెడు ఉన్నాయి. కాకినాడలోని జేఎన్‌టీయూ 2016-17 నుంచి 2021-22 వరకు ఆరు పద్దులు.. 2020-21, 2021-22కి సంబంధించి రెండు పద్దులు ఆడిట్‌కు సమర్పించలేదని కాగ్‌ నివేదికలో పేర్కొంది.. రాజమహేంద్రవరంలోని ఆదికవి నన్నయ విశ్వ విద్యాలయం 2021-22 సంవత్సరానికి సంబంధించిన పద్దు సమర్పించాల్సి ఉందని తెలిపింది. కాకినాడలో పీవీఆర్‌ ట్రస్ట్‌ కళాశాల 2016-17 నుంచి 2021-22 వరకు.. ఐడియల్‌ డిగ్రీ కళాశాల 2020-21, 2021-22 పద్దులు.. పి.వి.ఆర్‌ ట్రస్ట్‌ డిగ్రీ కళాశాల 2016-17 నుంచి 2021-22 వరకు... ఎంఎస్‌ఎన్‌ డిగ్రీ కళాశాల 2017- 18 నుంచి 2021- 22 వరకు... ఐడియల్‌ జూనియర్‌ కళాశాల 2020- 21, 2021- 22కు సంబంధించిన రెండు పద్దులు సమర్పించలేదని పేర్కొంది. రాజమహేంద్రవరంలోని ఎస్‌.కె.వి.టి డిగ్రీ కళాశాల 2020-21, 2021-22 సంవత్సరాలకు.. ఎస్‌.కె.ఆర్‌. మహిళా కళాశాల 2012-13, 2015-16, 2021-22.. అమలాపురంలోని ఎస్‌కేబీఆర్‌ కళాశాల 2020-21, 2021-22 సంవత్సరాల పద్దులు.. రామచంద్రపురంలోని వీఎస్‌ఎం కళాశాల 2017-18 నుంచి 2021-22 వరకు.. మలికిపురంలోని ఎం.వి.జె.ఎస్‌ అండ్‌ ఆర్‌.వి.ఆర్‌ డిగ్రీ కళాశాల 2010-11 నుంచి 2021-22 వరకు.. అనపర్తిలోని జి.బి.ఆర్‌ డిగ్రీ కళాశాల 2018-19 నుంచి 2021-22 వరకు ఆడిట్‌ పద్దులు సమర్పించలేదని కాగ్‌ పేర్కొంది.

ప్రభుత్వ రంగ సంస్థలూ..

కాకినాడ స్మార్ట్‌ సిటీ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ 2021-22 ఆడిట్‌కు సంబంధించిన పద్దులు సమర్పించలేదని కాగ్‌ వెల్లడించింది. గోదావరి పట్టణాభివృద్ధి సంస్థ (గుడా) 2017-18 నుంచి 2021- 22 వరకు.. రంపచోడవరం ఐటీడీఏ 2015-16 నుంచి 2021-22 వరకు.. కాకినాడ జిల్లా గ్రంథాలయ సంస్థ 2014-15 నుంచి 2021-22 వరకు ఎనిమిది పద్దులు.. జిల్లా సాక్షరతా సమితి 2017-18 నుంచి 2021- 22 వరకు అయిదు పద్దులు సమర్పించలేదని కాగ్‌ పేర్కొంది. తూర్పుగోదావరి జిల్లా జిల్లా న్యాయసేవల అథారిటీ 2021- 22కు ఆడిట్‌కు పద్దు
సమర్పించలేదని కాగ్‌ నివేదికలో పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని