logo

నన్నయలో ఆకట్టుకున్న సవిస్కార 2కె23

ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో కామర్స్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ విభాగం ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన సవిస్కార 2కె23 కార్యక్రమం ఆకట్టుకుంది.

Updated : 26 Mar 2023 04:51 IST

ఫ్లాష్‌మాబ్‌తో అలరిస్తున్న విద్యార్థులు

రాజానగరం: ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో కామర్స్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ విభాగం ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన సవిస్కార 2కె23 కార్యక్రమం ఆకట్టుకుంది. విద్యార్థుల సృజన వెల్లివిరిసింది. మేనేజ్‌మెంట్‌ ఫెస్ట్‌ కార్యక్రమంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పలు కళాశాలల నుంచి విచ్చేసిన విద్యార్థులు వివిధ పోటీల్లో ప్రతిభను చాటారు. సాంస్కృతిక కార్యక్రమాలు, ర్యాంప్‌ వాక్‌తో మెప్పించారు. వర్సిటీ మేనేజ్‌మెంట్‌ విద్యార్థుల ఫ్లాష్‌ మాబ్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సమస్యా పరిష్కారం, వేగవంత నిర్ణయాత్మకత, నైపుణ్యాల విశ్లేషణ, మేనేజ్‌మెంట్‌ థియరీలను ప్రాక్టికల్‌గా ఎలా అమలు చేయాలి, సిమ్యులేటెడ్‌ విధానం, మెమొరీ స్కిల్స్‌, డెసిషన్‌ మేకింగ్‌ స్కిల్స్‌ తదితర పోటీల్లో విద్యార్థులు ప్రతిభతో మెరిశారు. జీవితంలో ఎదురయ్యే ప్రతికూల సమయాలను సమర్థంగా ఎలా ఎదుర్కోవాలో ప్రయోగాత్మకంగా విద్యార్థులు ఈవెంట్స్‌ ద్వారా ప్రదర్శించారు. అకడమిక్‌ ఈవెంట్స్‌లో భాగంగా స్పర్థా, యాడ్‌మేడ్‌, బుల్‌ వర్సెస్‌ బేర్‌, ఫ్లోనో, అడ్మినార్‌, అడ్మెంటార్‌, టవర్‌ బిల్డింగ్‌, సెల్ఫీ టూరిజం, ఫన్‌ అండ్‌ మైండ్‌ గేమ్స్‌ అంశాలు ఆసక్తిగా సాగాయి. విజేతలకు అతిథులు పతకాలు, సర్టిఫికెట్లు అందించారు. రిజిస్ట్రార్‌ ఆచార్య టి.అశోక్‌ జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ప్రోగ్రామ్‌ కోఆర్డినేటర్‌ ఎన్‌.ఉదయభాస్కర్‌, ఆంధ్ర పేపర్‌ మిల్లు జీఎం టి.చక్రపాణి, ఛార్టెర్డ్‌ అకౌంటెంట్‌ బి.బ్రహ్మానందం, ప్రిన్సిపల్‌ ఆచార్య ఎస్‌.టేకి. పి.ఉమామహేశ్వరిదేవి, జి.రాజేంద్రప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని