logo

ముస్సోరి శిక్షణలో జేసీ తేజ్‌భరత్‌ ప్రతిభ

ముస్సోరిలో 45 రోజులపాటు నిర్వహించిన శిక్షణకు వెళ్లిన జిల్లా సంయుక్త కలెక్టర్‌ (జేసీ) తేజ్‌భరత్‌ అక్కడ రాత పరీక్ష, ‘భారత్‌దర్శన్‌’ అంశంపై గ్రూప్‌ ప్రెజెంటేషన్‌ రెండు విభాగాల్లో ప్రతిభ కనపరిచి ప్రథమ బహుమతి పొందారు.

Updated : 26 Mar 2023 04:52 IST

ప్రథమ బహుమతి అందుకుంటున్న జేసీ

వి.ఎల్‌.పురం(రాజమహేంద్రవరం): ముస్సోరిలో 45 రోజులపాటు నిర్వహించిన శిక్షణకు వెళ్లిన జిల్లా సంయుక్త కలెక్టర్‌ (జేసీ) తేజ్‌భరత్‌ అక్కడ రాత పరీక్ష, ‘భారత్‌దర్శన్‌’ అంశంపై గ్రూప్‌ ప్రెజెంటేషన్‌ రెండు విభాగాల్లో ప్రతిభ కనపరిచి ప్రథమ బహుమతి పొందారు. శిక్షణ ముగించుకుని తిరుగు ప్రయాణమైన ఆయన సోమవారం నుంచి ఇక్కడి విధులకు హాజరుకానున్నారు. రాష్ట్ర సివిల్‌ సర్వీసెస్‌ నుంచి ఇండియన్‌ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీస్‌కు పదోన్నతి పొందిన అధికారులకు ఉత్తరాఖండ్‌లోని ముస్సోరిలో లాల్‌బహదూర్‌శాస్త్రి నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ ఆడ్మినిస్టేషన్‌లో నిర్వహించిన 124వ పౌరసేవా శిక్షణ, ప్రేరణ శిక్షణ తరగతులకు హాజరయ్యేందుకు గత నెల 10న జేసీ వెళ్లారు. శిక్షణ అనంతరం నిర్వహించిన పరీక్షలో 139 ఐఏఎస్‌లు పాల్గొనగా వారిలో జేసీ తేజ్‌భరత్‌ ప్రథమ స్థానంలో నిలిచారు. దీంతోపాటు భారత్‌దర్శన్‌ అంశంపై ప్రెజెంటేషన్‌ ఇవ్వడం ద్వారా ప్రేరణ తరగతి బ్యాచ్‌లో గ్రూప్‌ విభాగంలో మొదటి స్థానంలో నిలిచి ఎల్‌బీఎస్‌ఎన్‌ఏఏ ప్రత్యేక సంచాలకురాలు రాధికా రస్తోగి, ముఖ్యఅతిథి డీవోపీటీ మాజీ కార్యదర్శి అజయ్‌మిట్టల్‌ చేతుల మీదుగా అవార్డు అందుకున్నట్లు జేసీ ఒక ప్రకటనలో తెలిపారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని