logo

రోడ్డు కమ్‌ రైలు వంతెన మరమ్మతులు ప్రారంభం

రాజమహేంద్రవరం-కొవ్వూరు మధ్య గోదావరిపై ఉన్న రోడ్డు కమ్‌ రైలు వంతెన మరమ్మతు పనులు ఆదివారం ప్రారంభించారు.

Published : 27 Mar 2023 05:16 IST

కొవ్వూరు వైపు కాంక్రీట్‌ పనులు

కొవ్వూరు పట్టణం, కంబాల చెరువు, న్యూస్‌టుడే: రాజమహేంద్రవరం-కొవ్వూరు మధ్య గోదావరిపై ఉన్న రోడ్డు కమ్‌ రైలు వంతెన మరమ్మతు పనులు ఆదివారం ప్రారంభించారు. రైల్వే, ర.భ.శాఖ అధికారులు వంతెనపై దెబ్బతిన్న హ్యాండ్‌ రెయిలింగ్‌, ధ్వంసమైన ఫుట్‌పాత్‌ స్లాబు నిర్మాణం చేపట్టారు. ఆదివారం ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు వాహన రాకపోకలను నిలిపివేసి యంత్రాలతో చేపట్టాల్సిన పనులు పూర్తిచేశారు. క్రేన్‌, ఇతర యంత్రాల సహకారంతో ఐరన్‌ ప్లేట్లను తొలగించి కాంక్రీట్‌ ఫుట్‌పాత్‌, శ్లాబులను ఏర్పాటు చేశారు. విరిగిన హ్యాండ్‌ రెయిల్స్‌ను పూర్తిగా తొలగించడంతో రైల్వే శాఖ గడ్డర్ల నిర్మాణం, ఇతర పటిష్ఠ పనులు చేసుకునేందుకు వీలు కలగనుంది. సాయంత్రం నుంచి వాహన రాకపోకలను పునరుద్ధరించారు. ర.భ.శాఖ జిల్లా ఇంజినీరు ఎస్‌బీవీ రెడ్డి, డీఈఈ మధుసూదన్‌ పనులను పరిశీలించారు. మరో పది నుంచి 15 రోజులపాటు ఇవి కొనసాగుతాయన్నారు. పనులు కొనసాగినా వాహన రాకపోకలకు ఎలాంటి ఇబ్బందీ ఉండదని వివరించారు.

క్రేన్‌ సాయంతో ఫుట్‌పాత్‌ బల్లలు అమర్చుతూ...

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని