బాధిత కుటుంబాలను ఆదుకోవాలి
గ్రామదేవత జాతరలో చోటు చేసుకున్న ఘర్షణ నేపథ్యంలో మృతిచెందిన దళిత యువకుడు రాము కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత డిమాండు చేశారు.
రాము కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న అనిత
తొండంగి: గ్రామదేవత జాతరలో చోటు చేసుకున్న ఘర్షణ నేపథ్యంలో మృతిచెందిన దళిత యువకుడు రాము కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత డిమాండు చేశారు. ఆదివారం తొండంగిలోని బాధిత కుటుంబాన్ని విశాఖ జిల్లా ఎస్సీసెల్ ప్రధాన కార్యదర్శి విలియంకేరి, దిబ్బ శ్రీనుతో కలిసి పరామర్శించారు. ఆమె మాట్లాడుతూ వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి హత్యా రాజకీయాలు పెరిగిపోయాయని ఆరోపించారు. దళిత పక్షపాతి అని చెప్పుకునే ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే తక్షణం బాధిత కుటుంబానికి రూ.కోటి పరిహారం ఇవ్వాలన్నారు. ఆమె వెంట దళిత నాయకులు పిల్లి బాబ్జి, నేపా కృష్ణ, సోమాల ప్రసాద్, తెదేపా నాయకులు మురాలశెట్టి సత్తిబాబు, బుజ్జి తదితరులు ఉన్నారు.
శృంగవృక్షంలో జైభీమ్ మాలమహానాడు నేతల ఆందోళన
నిందితుల అరెస్టుకు డిమాండు
రాము మృతికి కారణమైన నిందితులను తక్షణమే అరెస్టు చేయాలని జైభీమ్ మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు తంతటి కిరణ్ డిమాండ్ చేశారు. తొండంగి, శృంగవృక్షం గ్రామాల్లోని బాధిత కుటుంబాలను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఘటనలో గాయాలపాలైన వారిని ఆదుకోవాలని, నిత్యావసర సరకులు అందించాలన్నారు. బండి చిట్టిబాబు, రుత్తల సత్తిబాబు సుధీర్ తదితరులతో కలిసి ఆందోళన చేపట్టారు. జనవిజ్ఞాన వేదిక జిల్లా నాయకుడు ఎన్.సూర్యనారాయణ సైతం బాధిత కుటుంబాలను పరామర్శించారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
Vijayawada: 9వ తేదీ వరకు పలు రైళ్ల రద్దు: విజయవాడ రైల్వే అధికారులు
-
Politics News
Sachin Pilot: సచిన్ పైలట్ కొత్త పార్టీ?
-
India News
Odisha Train Accident: పరిహారం కోసం ‘చావు’ తెలివి
-
World News
పాక్ మీడియాలో ఇమ్రాన్ కనిపించరు.. వినిపించరు
-
India News
క్రికెట్ బుకీని ఫోన్‌కాల్స్‌తో పట్టించిన అమృతా ఫడణవీస్
-
India News
సోదరి కులాంతర వివాహం.. బైక్‌పై వచ్చి ఎత్తుకెళ్లిన అన్న