logo

భూకంప వేళ అప్రమత్తమయ్యేలా..!

సెల్‌ఫోన్‌ టెక్నీషియన్‌, సూక్ష్మ కళాఖండాల నిపుణుడు ఆరిపాక రమేష్‌బాబు వినూత్నంగా ఆలోచించారు. ప్రకంపనలు మొదలవడానికి ముందే ప్రమాదంపై అప్రమత్తం చేసేలా అలారం రూపొందించారు.

Updated : 27 Mar 2023 05:46 IST

స్వల్ప ప్రకంపనలకే మోగే అలారాలు

భూకంపాలతో ఎదురయ్యే అపార ఆస్తి, ప్రాణ నష్టాలను టీవీల్లో చూసిన కాకినాడకు చెందిన

సెల్‌ఫోన్‌ టెక్నీషియన్‌, సూక్ష్మ కళాఖండాల నిపుణుడు ఆరిపాక రమేష్‌బాబు వినూత్నంగా ఆలోచించారు. ప్రకంపనలు మొదలవడానికి ముందే ప్రమాదంపై అప్రమత్తం చేసేలా అలారం రూపొందించారు. ఇవి రెండు రకాలుగా ఉంటాయి. వీటిని ఇంటి గోడకు అమర్చుకుంటే ప్రకంపనలు మొదలైన వెంటనే మోగే శబ్దంతో ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు. సింగిల్‌, డ్యూయెల్‌ సెన్సర్‌తో 9 ఓల్టుల బ్యాటరీ సాయంతో ఇవి పనిచేస్తాయి. సింగిల్‌ సెన్సార్‌ సిస్టం లోలకంతో పనిచేస్తుంది. దీన్ని వినియోగించి 0.5 సెంటీమీటర్ల నుంచి మూడు సెంటీమీటర్ల వరకూ ప్రకంపనలను గుర్తించి అలారం మోగిస్తుంది. డ్యూయెల్‌ సెన్సర్‌ సిస్టం రెండు లోలకాలతో పనిచేస్తుంది. మొదటి లోలకం 3 సెంటీమీటర్లకు పైగా ప్రకంపనలు గమనించి అప్రమత్తం చేస్తే, రెండో లోలకం 0.5 సెంటీమీటర్ల నుంచి 3 సెంటీమీటర్లలోపు ప్రకంపనలకు అలారం మోగిస్తుంది. ఎతైన భవనాలు, అపార్ట్‌మెంట్లు, పరిశ్రమలు, కార్యాలయాల్లో వీటిని అమర్చుకోవడం వల్ల ప్రకంపనలు మొదలవగానే అప్రమత్తమై ప్రమాదం నుంచి సురక్షితంగా తప్పించుకోవచ్చని రమేష్‌బాబు చెబుతున్నారు.

న్యూస్‌టుడే, గాంధీనగర్‌ (కాకినాడ) రమేష్‌బాబు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు