logo

28 నుంచి శ్రీవేంకటేశ్వరుని కల్యాణ మహోత్సవాలు

కోనసీమ కల్యాణ వెంకన్నగా పేరొందిన శ్రీవేంకటేశ్వరస్వామి కల్యాణ మహోత్సవాలు ఈ నెల 28 నుంచి ఏప్రిల్‌ 7వ తేదీ వరకు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ ధర్మకర్తల మండలి ఛైర్‌పర్సన్‌ దూడల విరీత దేవి తెలిపారు.

Updated : 27 Mar 2023 05:46 IST

కల్యాణమహోత్సవాల గోడ పత్రికలను ఆవిష్కరిస్తున్న విరీత దేవి, సభ్యులు

అమలాపురం పట్టణం, న్యూస్‌టుడే: కోనసీమ కల్యాణ వెంకన్నగా పేరొందిన శ్రీవేంకటేశ్వరస్వామి కల్యాణ మహోత్సవాలు ఈ నెల 28 నుంచి ఏప్రిల్‌ 7వ తేదీ వరకు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ ధర్మకర్తల మండలి ఛైర్‌పర్సన్‌ దూడల విరీత దేవి తెలిపారు. పాలక మండలి సభ్యులతో కలిసి ఆమె ఆదివారం కల్యాణ మహోత్సవాల గోడ, ఆహ్వాన పత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 28న ఉదయం 8.10 గంటలకు స్వామి, అమ్మవార్లను పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తెను చేయడానికి ఎదురు సన్నాహ కార్యక్రమం జరుగుతుందన్నారు. 31న ఉదయం 10 గంటలకు స్వామివారి కల్యాణం, అనంతరం 10 వేల మందికి అన్నసమారాధన, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఏప్రిల్‌ 1న తీర్థం, రథోత్సవం, 3న తెప్పొత్సవం, రాత్రి అశ్వగంధర్వ గ్రామోత్సవం, 5న ఆంజనేయస్వామి వారి గ్రామోత్సవం, 6న పూర్ణాహుతి, చక్రస్నానం, ఉయ్యాలసేవల కార్యక్రమంతో ఉత్సవాలు ముగుస్తాయన్నారు. దాతల సహకారంతో ఆలయంలో నూతనంగా నిర్మించిన శాలహారం, స్వామి కల్యాణం నిర్వహించే  మండపం అందుబాటులోకి రానున్నాయన్నారు.  ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో సాయిబాబు, నడింపల్లి వర్మ, కుసుమ శ్రీను, ముంగర ప్రసాద్‌, భరణి కానబాబు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని