logo

‘హోంమంత్రి ఇలాకాలో క్షీణించిన శాంతిభద్రతలు’

హోంమంత్రి నియోజకవర్గంలో శాంతి, భద్రతలు క్షీణిస్తున్నాయని మాజీ మంత్రి, జిల్లా తెదేపా అధ్యక్షుడు కేఎస్‌ జవహర్‌ ఆదివారం ఆరోపించారు. శీని ప్రసాద్‌ను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.

Updated : 27 Mar 2023 05:48 IST

ప్రసాద్‌ భౌతికకాయంపై తెదేపా జెండా కప్పుతున్న నాయకులు

కొవ్వూరు పట్టణం: హోంమంత్రి నియోజకవర్గంలో శాంతి, భద్రతలు క్షీణిస్తున్నాయని మాజీ మంత్రి, జిల్లా తెదేపా అధ్యక్షుడు కేఎస్‌ జవహర్‌ ఆదివారం ఆరోపించారు. శీని ప్రసాద్‌ను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. వేములూరులో మృతుడి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ విషయాన్ని అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తామన్నారు. బాధిత కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందన్నారు. ఇసుక వ్యాపారంలో నష్టపోయి ప్రేమ్‌రాజ్‌ బలవన్మరణం, ప్రసాద్‌ హత్య బాధాకరమన్నారు. ‌నియోజకవర్గ తెదేపా ద్విసభ్య కమిటీ సభ్యులు కంఠమణి రామకృష్ణ, జొన్నలగడ్డ సుబ్బరాయచౌదరి, క్లస్టర్‌ ఇన్‌ఛార్జి మరపట్ల కళాధర్‌ సాయంత్రం వరకు సంఘటనా స్థలం వద్దే ఉన్నారు. పోలీసులకు క్షేత్ర స్థాయి పరిస్థితి వివరించారు. పోస్టుమార్టం అనంతరం ప్రసాద్‌ మృతదేహాన్ని ఊరేగింపుగా తీసుకొచ్చి పార్టీ జెండాను కప్పి సంతాపం తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని