logo

హక్కుల సాధనకు కృషి చేద్దాం

ఉపాధ్యాయ నేతల త్యాగాల ఫలితంగా ఐక్య ఉపాధ్యాయ సంఘం ఏర్పడిందని ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ అన్నారు. యూటీఎఫ్‌ ఉద్యమ నిర్మాత అప్పారి వెంకటస్వామి...

Published : 27 Mar 2023 05:16 IST

మాట్లాడుతున్న ఎమ్మెల్సీ షేక్‌సాబ్జీ

శ్యామలాసెంటర్‌(రాజమహేంద్రవరం): ఉపాధ్యాయ నేతల త్యాగాల ఫలితంగా ఐక్య ఉపాధ్యాయ సంఘం ఏర్పడిందని ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ అన్నారు. యూటీఎఫ్‌ ఉద్యమ నిర్మాత అప్పారి వెంకటస్వామి, వత్సవాయి సూర్యనారాయణరాజు వర్ధంతి కార్యక్రమం ఆదివారం రాజమహేంద్రవరం వీటీ డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో జరిగింది. ఈ సందర్భంగా సాబ్జీ మాట్లాడుతూ ఉద్యమ నాయకులు తమ జీతాలు, జీవితాలు సైతం పణంగా పెట్టి ఉపాధ్యాయ హక్కుల సాధనకు కృషి చేశారన్నారు. ప్రభుత్వ తీరుతో ప్రాథమిక విద్య పేదలకు దూరమవుతోందన్నారు. ఎల్‌ఐసీ ఉద్యోగుల సంఘ ఆలిండియా కార్యదర్శి పి.సతీష్‌ మాట్లాడుతూ  ప్రశ్నించిన గొంతులకు సంకెళ్లు పడుతుండటం దురదృష్టకరమన్నారు. యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు జయకర్‌ మాట్లాడుతూ ప్రభుత్వ విద్యా వ్యతిరేక ధోరణులను తిప్పి కొట్టాలన్నారు. సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి షరీఫ్‌, కోశాధికారి ప్రసాద్‌, పలువురు సభ్యులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని