అక్రమంగా.. అధరకొట్టేద్దామని..
గరువు పర్రకోటి వంతెన సమీపంలో ఇటీవల ఓ లేఔట్ వెలిసింది. ఈ లేఔట్‌కు పంచాయతీ అనుమతులు తీసుకోకుండానే రోడ్లు వేసేశారు. పంచాయతీ అధికారులు హెచ్చరించినా యజమానులు స్పందించకపోవడంతో చివరికి లేఔటు వద్ద హెచ్చరిక ఫ్లెక్సీ ఏర్పాటు చేయడంతోపాటు నోటీసు అంటించారు.
జిల్లా కేంద్రం అమలాపురం మండలం కామన
న్యూస్‌టుడే, అమలాపురం గ్రామీణం
జనుపల్లెలో పంచాయతీ అనుమతులు లేకుండా వెలసిన లేఔట్
* గరువు పర్రకోటి వంతెన సమీపంలో ఇటీవల ఓ లేఔట్ వెలిసింది. ఈ లేఔట్‌కు పంచాయతీ అనుమతులు తీసుకోకుండానే రోడ్లు వేసేశారు. పంచాయతీ అధికారులు హెచ్చరించినా యజమానులు స్పందించకపోవడంతో చివరికి లేఔటు వద్ద హెచ్చరిక ఫ్లెక్సీ ఏర్పాటు చేయడంతోపాటు నోటీసు అంటించారు.
* అమలాపురం మండలం జనుపల్లె మన్నాకాలనీలో పంచాయతీ అనుమతులు లేకుండా కొద్దిరోజుల క్రితం లేఔట్ ఏర్పాటు చేశారు. అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని పంచాయతీ అధికారులు చెప్పినప్పటికీ వినకుండా రోడ్లు వేసేశారు. పంచాయతీ అధికారులు లేఔట్‌కు నాలుగువైపులా అనధికార లేఔట్ అని బోర్డులు ఏర్పాటు చేసి వదిలేశారు.
కాస్త పెట్టుబడి, అధికార అండ ఉంటే.. తక్కువ కాలంలో రూ.కోట్లకు పడగలెత్తొచ్చనే దురాశతో కొందరు లేఔట్లు వేసేస్తున్నారు. అనుమతులు లేకుండా అక్రమాలకు పాల్పడుతున్న వారిని కట్టడి చేసే విషయంతో అధికారులు కఠినంగా వ్యవహరించాల్సిఉన్నా.. చర్యలు అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. అమలాపురం పట్టణం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కేంద్రం కావడంతో రియల్టర్లు వ్యవసాయ భూములను లేఔట్లుగా చేసి అమ్మేసేందుకు బరితెగిస్తున్నారు. పట్టణ సమీప గ్రామాల్లో వ్యాపారం జోరుగా సాగిస్తున్నారు. అమలాపురం పురపాలిక మాస్టర్ ప్లాన్ పరిధిలోకి మండలంలోని పలు గ్రామాలు వస్తున్నాయనే ప్రచారంతో లేఔట్లుగా వేసే భూముల్లో రహదారులు నిర్మించేస్తున్నారు.
కామనగరువు పర్రకోటి వంతెన సమీపంలో అనధికార లేఔట్
నిబంధనలు పక్కకు నెట్టి..
గ్రామాల్లో లేఔట్లు వేయాలంటే పంచాయతీ, డీటీసీపీ నుంచి అనుమతులు తీసుకోవాలి. సంబంధిత స్థలాన్ని వ్యవసాయేతర భూమిగా మార్చుకోవాలి. సామాజిక అవసరాలకు 10 శాతం స్థలం కేటాయించాలి. వీటితోపాటు లేఔట్‌లో ప్రధాన, అంతర్గత రోడ్లు 33-40 అడుగులు వెడల్పు ఉండేలా ఏర్పాటు చేయాలి. గ్రామీణ మండలంలో ఏర్పాటుచేసే లేఔట్లలో ఈ నిబంధనలేమీ అమలు చేయడం లేదు. లేఔట్లు వేసే ప్రాంతం ఎవరికీ కనిపించకుండా చుట్టూ పచ్చటి వస్త్రంకట్టి రోడ్లు వేసేస్తున్నారు. పంచాయతీ అధికారులు ఆ లేఔట్ల వద్దకు వస్తే అధికార పార్టీ నాయకులతోపాటు అండదండలుండే వ్యక్తులతో ఫోన్ చేయిస్తున్నట్లు ఆరోపణలున్నాయి.
గ్రామీణంలోనే అధికంగా..
అమలాపురం గ్రామీణ మండలంలో 22 గ్రామ పంచాయతీలున్నాయి. వీటి పరిధిలోని సుమారు పది గ్రామాలు పట్టణానికి ఆనుకుని ఉండటంతో లేఔట్లు వేసేస్తున్నారు. లేఔట్ ఏర్పాటుచేసే ముందు పంచాయతీ నుంచి అనుమతులు తీసుకోకున్నా.. వారికి అడ్డు ఉండడం లేదు. దీంతో అనధికార లేఔట్ల సంఖ్య రోజురోజుకీ అధికమవుతోంది. గతేడాది నుంచి ఇప్పటివరకు సుమారు 20 వరకు లేఔట్లు గ్రామీణ మండలంలో వెలిశాయి. కామనగరువు, బండారులంక, పేరూరు, సమనస, జనుపల్లె, తాండవపల్లి, నడిపూడి, పాలగుమ్మితోపాటు పలు ప్రాంతాల్లో లేఔట్ల సంస్కృతి విస్తరిస్తోంది.
నోటీసులిస్తున్నాం..
- జి.మల్లికార్జునరావు, ఇన్‌ఛార్జి డీఎల్పీవో, అమలాపురం
గ్రామ పంచాయతీల్లో అనధికారికంగా ఏర్పాటు చేసిన లేఔట్లను గుర్తించి వారికి నోటీసులు ఇస్తున్నాం. లేఔట్ల వద్ద బోర్డులు కూడా ఏర్పాటు చేస్తున్నాం. అనధికార లేఔట్లలో భూములు కొనుగోలు చేయవద్దని ప్రజలకు అవగాహన కల్పించేలా చర్యలు చేపడతాం.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
Ponguleti: విజయనగరం సీనరేజి టెండరూ ‘పొంగులేటి’ సంస్థకే
-
Crime News
పెళ్లై నెల కాకముందే భర్త మృతి.. కొత్త జంటను వేరుచేసిన రైలు ప్రమాదం
-
Ap-top-news News
లింగమనేని రమేష్ ఇల్లు జప్తుపై నిర్ణయానికి అనిశా కోర్టు నిరాకరణ
-
Crime News
ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టు పెట్టారని యువకుడికి నోటీసు.. మఫ్టీలో పులివెందుల పోలీసులు
-
India News
Secunderabad-Agartala Express: సికింద్రాబాద్ - అగర్తలా రైలులో షార్ట్ సర్క్యూట్
-
Ap-top-news News
Viveka Murder Case: ‘భాస్కరరెడ్డి బయట ఉంటే సాక్షులెవరూ ముందుకు రారు’