logo

ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలి

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను తక్షణం భర్తీ చేయాలని ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ ప్రభుత్వాన్ని కోరారు.

Published : 28 Mar 2023 05:35 IST

మాట్లాడుతున్న షేక్‌ సాబ్జీ, ప్రతినిధులు

జగ్గంపేట, న్యూస్‌టుడే: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను తక్షణం భర్తీ చేయాలని ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ ప్రభుత్వాన్ని కోరారు. జగ్గంపేటలోని యూటీఎఫ్‌ హోమ్‌లో సోమవారం విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. పాఠశాల విద్యాశాఖ పరిధిలో 50,675 పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర విద్యాశాఖామంత్రి ప్రకటించారన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో లేవనెత్తిన ప్రశ్నలకు కేవలం 715 ఉపాధ్యాయ పోస్టులు మాత్రమే ఖాళీగా ఉన్నాయని రాష్ట్ర విద్యాశాఖమంత్రి చెప్పారన్నారు. రేషనలైజేషన్‌ ప్రకారం పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్రం చెబుతుంటే రాష్ట్రప్రభుత్వం కొత్తగా 117 జీవో తీసుకొచ్చి విధానాలు మార్చడం వల్ల పోస్టులు అవసరం లేకుండా చూపుతుందన్నారు. ఈ ఏడాది నూతనంగా 292 జూనియర్‌ కళాశాలలను ప్రారంభించినా అధ్యాపక, ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయలేదన్నారు. జగ్గంపేట మోడల్‌ డిగ్రీ కళాశాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు రూసా నుంచి రూ.12 కోట్లు విడుదల కాగా కేవలం రూ.8 కోట్లు మాత్రమే ఖర్చుచేసి మిగిలిన రూ.4 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టించిందని ఆరోపించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని