logo

ఎస్టీ ఉద్యోగుల జిల్లా నూతన కార్యవర్గం

ఎస్టీ ఉద్యోగుల సంఘం తూర్పుగోదావరి జిల్లా నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. సోమవారం కార్యాలయంలో జరిగిన సమావేశంలో కొత్త కార్యవర్గాన్ని ఎంపిక చేశారు.

Published : 28 Mar 2023 05:35 IST

నూతన కార్యవర్గ సభ్యులు

టి.నగర్‌, న్యూస్‌టుడే: ఎస్టీ ఉద్యోగుల సంఘం తూర్పుగోదావరి జిల్లా నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. సోమవారం కార్యాలయంలో జరిగిన సమావేశంలో కొత్త కార్యవర్గాన్ని ఎంపిక చేశారు. జిల్లా గౌరవ అధ్యక్షుడిగా ఎస్‌.రాజారావు (సూపరింటెండెంటు ఆఫ్‌ జైల్‌, రాజమహేంద్రవరం) నియమితులయ్యారు. అధ్యక్షుడిగా డాక్టర్‌ ఆర్‌ఎస్‌ వరహాలు దొర, కార్యదర్శిగా డి.ప్రసన్నబాబు, సలహా సంఘం సభ్యులుగా ఆర్‌.విజయ్‌కుమార్‌ బాబు, విజయ్‌ నిర్మల, లీగల్‌ డైరెక్టర్‌ కె.రామకృష్ణ దొర, ఉపాధ్యక్షులుగా కె.రంగారావు, జాయింటు సెక్రటరీగా ఎం.నరసింహారెడ్డి, అదనపు సహ కార్యదర్శిగా పి.సింహాచలం, ట్రెజరర్‌గా వై.శ్రీనులను ప్రకటించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఉద్యోగులు మాట్లాడారు. జీఓ నెం 52 ప్రకారం బోయ, వాల్మీకులను అసెంబ్లీలో ఎస్టీ జాబితాలో చేర్చాలన్న ప్రభుత్వ ప్రతిపాదనను పునరాలోచించాలని, ఈ నిర్ణయాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని