logo

న్యాయం చేయకుంటే.. మరణమే శరణ్యం

తమకు న్యాయం చేయాలని కోరుతూ గతనెల 27న కాకినాడ కలెక్టరేట్‌ భవనంపైకి ఎక్కి ఆత్మహత్యయత్నం చేసిన దుర్గాదేవి సోమవారం మళ్లీ కలెక్టరేట్‌లో ఫిర్యాదు చేశారు.

Published : 28 Mar 2023 05:35 IST

భర్తతో కలిసి నిరసన తెలుపుతున్న దుర్గాదేవి

కాకినాడ కలెక్టరేట్‌: తమకు న్యాయం చేయాలని కోరుతూ గతనెల 27న కాకినాడ కలెక్టరేట్‌ భవనంపైకి ఎక్కి ఆత్మహత్యయత్నం చేసిన దుర్గాదేవి సోమవారం మళ్లీ కలెక్టరేట్‌లో ఫిర్యాదు చేశారు. న్యాయం కోసం తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌ వద్దకు పంపించారని, అక్కడా  న్యాయం జరగలేదన్నారు. ఇక మరణమే శరమణ్యమని, ఇప్పటికైనా కనికరించాలని దుర్గాదేవి కాకినాడ కలెక్టర్‌ కృతికాశుక్లాకు స్పందనలో ఆమె భర్తతో కలిసి వినతి పత్రం అందజేశారు. రాజమహేంద్రవరంలో కలెక్టర్‌ వద్దకు వెళితే.. అక్కడి నుంచి మూడో పట్టణ పోలీసుల వద్దకు పంపారని, తప్పుడు ఫిర్యాదు రాసి తనతో సంతకం చేయించుకున్నారని ఆమె వాపోయారు. రాజమహేంద్రవరంలో ఉన్న తన ఆస్తిని దొంగ రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారని, దీనిలో అక్కడి మాజీ కార్పొరేటర్‌ ప్రమేయం ఉందని ఆరోపించారు. అన్ని ఆధారాలను స్పందనలో సమర్పించినా న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. భర్తతో పాటు తనను చంపాలని చూస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దుర్గాదేవి తన ఆవేదనను ప్లకార్డు రూపంలో కాకినాడ కలెక్టరేట్‌ వద్ద ప్రదర్శించారు. ఆమె మళ్లీ అక్కడకు రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. కలెక్టర్‌కు వినతి పత్రం అందించిన తర్వాత భార్యభర్తలను అక్కడి నుంచి పంపించేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని