నిత్యాన్నదాన భవన నిర్మాణానికి శ్రీకారం
కోనసీమ తిరుమల వాడపల్లి వేంకటేశ్వరుని క్షేత్రానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన వసతి సౌకర్యాలు కల్పించనున్నట్లు ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి తెలిపారు.
భూమి పూజలో ప్రభుత్వ విప్ జగ్గిరెడ్డి తదితరులు
వాడపల్లి (ఆత్రేయపురం), న్యూస్‌టుడే: కోనసీమ తిరుమల వాడపల్లి వేంకటేశ్వరుని క్షేత్రానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన వసతి సౌకర్యాలు కల్పించనున్నట్లు ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి తెలిపారు. ఆయన సోమవారం రూడా ఛైర్‌పర్సన్ షర్మిలారెడ్డి, శ్రీకాకుళపు శివరామసుబ్రహ్మణ్యంతో కలిసి శ్రీనివాస ప్రాంగణంలో రూ.5.50 కోట్లతో నిర్మించనున్న శ్రీవకుళమాత నిత్యాన్నదాన భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు. పాలకమండలి ఛైర్మన్ రుద్రరాజు రమేష్‌రాజు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జగ్గిరెడ్డి మాట్లాడుతూ సెప్టెంబరు 3 నాటికి పనులు పూర్తిచేసి భవనాన్ని ప్రారంభించనున్నట్లు చెప్పారు. షర్మిలారెడ్డి మాట్లాడుతూ ఆలయ పరిసరాల్లో లైటింగ్, ఇతర అభివృద్ధి పనులకు రూ.50 లక్షలు నిధులు ఇచ్చేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. శివరామసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఆలయ సమీపంలో జిల్లాలోని ఆర్యవైశ్యుల సహకారంతో రూ.15 కోట్లతో అత్యాధునిక కల్యాణ మండపం, విశ్రాంతి గదులు నిర్మించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఎంపీపీ కుండ అన్నపూర్ణ, జడ్పీటీసీ సభ్యుడు బోణం సాయిబాబు, గ్రామ ఉప సర్పంచి పోచిరాజు బాబూరావు, ఈవో ముదునూరి సత్యనారాయణరాజు, కొత్తపేట మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ ముదునూరి రామరాజు, ఆత్రేయపురం పీఏసీఎస్ ఛైర్మన్ పీఎస్ రాజు, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
42 ఏళ్ల వయసులో అదృశ్యమై... 33 ఏళ్ల తర్వాత ఇంటికి!
-
Ts-top-news News
సిద్దిపేట శివారులో.. త్రీడీ ప్రింటింగ్ ఆలయం
-
India News
‘స్క్విడ్ గేమ్’ పోటీలో విజేతగా భారతీయుడు
-
Politics News
పార్టీని విలీనం చేయను.. పొత్తులు పెట్టుకోను
-
General News
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (02/06/2023)
-
Sports News
కుర్రాళ్లు కేక.. ఫైనల్లో పాకిస్థాన్‌పై విజయం