logo

పరిశ్రమల స్థాపనకు మహిళలు ముందుకు రావాలి

చిన్న తరహా పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు ఔత్సాహికులైన మహిళలు ముందుకు రావాలని కలెక్టర్‌ హిమాన్షు శుక్లా సూచించారు.

Published : 28 Mar 2023 05:35 IST

లబ్ధిదారులకు చెక్కు అందజేస్తున్న కలెక్టర్‌ హిమాన్షు శుక్లా

అమలాపురం కలెక్టర్‌, న్యూస్‌టుడే: చిన్న తరహా పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు ఔత్సాహికులైన మహిళలు ముందుకు రావాలని కలెక్టర్‌ హిమాన్షు శుక్లా సూచించారు. సోమవారం జిల్లా వ్యాప్తంగా చిన్న తరహా పరిశ్రమల్లో భాగంగా 34 యూనిట్ల ఏర్పాటుకు వివిధ బ్యాంకుల నుంచి మంజూరైన రూ.58 లక్షల రుణాలను లబ్ధిదారులకు అందజేశారు. కోనసీమ ప్రాంతం కొబ్బరికి పెట్టింది పేరు అని, జిల్లా వ్యాప్తంగా కొబ్బరి ఆధారిత ఉత్పత్తుల పరిశ్రమల స్థాపనకు ముందుకు వస్తే అవసరమైన సాంకేతికత అందించడంతో పాటు, రాయితీలు ఇచ్చి ప్రోత్సహిస్తామన్నారు. 34 యూనిట్లు ఏర్పాటు చేయడం ద్వారా 124 మందికి ఉపాధి లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారి శివశంకర ప్రసాద్‌, లీడ్‌బ్యాంక్‌ మేనేజర్‌ లక్ష్మీ నారాయణ, చిన్న తరహా పరిశ్రమల శాఖ అధికారి శ్రీనివాసరావు, డ్వాక్రా మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


మరింత మెరుగైన వైద్య సేవలు

గ్రామీణ ప్రాంత వాసులకు మరింత మెరుగైన వైద్యం అందించేందుకు జిల్లాకు నూతనంగా 104 వాహనాలను మంజూరు చేసినట్లు కలెక్టర్‌ హిమాన్షు శుక్లా తెలిపారు. 15 వాహనాలను సోమవారం బాలయోగి స్టేడియంలో కలెక్టర్‌, పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు జెండా ఊపి ప్రారంభించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ పల్లె వాసులకు పూర్తి స్థాయి వైద్య సేవలు అందించేందుకు ఇటీవల ప్రభుత్వం ఫ్యామిలీ డాక్టర్‌ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిందని, విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి సౌకర్యాల కల్పనలో భాగంగా ఈ కొత్త  వాహనాలు మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు. ఏడీఎంహెచ్‌వో భరత లక్ష్మి మాట్లాడుతూ ఇప్పటి వరకు జిల్లాలో 22 వాహనాలు సేవలు అందిస్తున్నాయని, అదనంగా మరో 15 రావడం సంతోషకరమన్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని