logo

రాపాక.. విలువల గురించి తెలుసుకో: తెదేపా

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి వద్ద గుర్తింపు కోసం రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ తెదేపా ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు చేయడం దుర్మార్గమని, జనసైనికుల కష్టంపై నెగ్గిన రాపాక విలువల గురించి మాట్లాడటం సిగ్గుచేటు అని మాజీ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు విమర్శించారు.

Published : 28 Mar 2023 05:35 IST

మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే ఆనందరావు, నాయకులు

అమలాపురం పట్టణం: ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి వద్ద గుర్తింపు కోసం రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ తెదేపా ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు చేయడం దుర్మార్గమని, జనసైనికుల కష్టంపై నెగ్గిన రాపాక విలువల గురించి మాట్లాడటం సిగ్గుచేటు అని మాజీ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు విమర్శించారు. అమలాపురం తెదేపా కార్యాలయంలో రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల రమణబాబు ఆధ్వర్యంలో  సోమవారం  సమావేశం నిర్వహించారు. ఆనందరావు మాట్లాడుతూ వైకాపా టిక్కెట్‌ ఇవ్వకుండా గెంటేస్తే జనసేన గుర్తుపై గెలిచి,  జనసేనను వదిలి జగన్‌ భజన చేస్తున్న రాపాకను అస్త్రసన్యాసం చేయిస్తారని దుయ్యబట్టారు.  2024లో వైకాపా టిక్కెట్‌ దక్కదని తెదేపాపై ఆరోపణలు చేయడం తగదన్నారు. ఎంపీ నందిగం సురేష్‌తో తోటి దళిత ఎమ్మెల్యే శ్రీదేవిపై సీఎం అనుచిత వ్యాఖ్యలు చేయిస్తున్నారని, దళిత ఎమ్మెల్యేలు అంటే అంత లోకువా అని విమర్శించారు.

విచ్చలవిడిగా గంజాయి:  పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలో ఒక ఉద్యోగి గంజాయితో వెళ్లడం దురదృష్టకరమని, రాష్ట్రంలో వైకాపా ఆధ్వర్యంలో గంజాయి, నాటుసారా విచ్చలవిడిగా దొరుకుతున్నట్లు తెలుగు మహిళా జిల్లా అధ్యక్షురాలు పెచ్చెట్టి విజయలక్ష్మి ఆరోపించారు.  ఇప్పటికైనా తగిన బుద్ధితెచ్చుకోకపోతే ప్రజలు చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి పెచ్చెట్టి చంద్రమౌళి, జిల్లా కార్యదర్శి అల్లాడ సోంబాబు, టి.నేతాజీ, అబ్బిరెడ్డి చంటి, బొర్రా ఈశ్వరరావు, మాకిరెడ్డి పూర్ణిమ, పి.ధర్మపాల్‌, వలవల శివరావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని