logo

కోదండ రామునికి పరిణయ శోభ

పెదపూడి మండలం జి.మామిడాడలో సీతారాముల కల్యాణ వేడుకకు విస్తృత ఏర్పాట్లు చేశారు.

Published : 30 Mar 2023 05:26 IST

ప్రత్యేక అలంకరణలో దేవతామూర్తులు

జి.మామిడాడ(పెదపూడి): పెదపూడి మండలం జి.మామిడాడలో సీతారాముల కల్యాణ వేడుకకు విస్తృత ఏర్పాట్లు చేశారు. గురువారం తెల్లవారు జామున 4.30 గంటలకు రామ పుష్కరిణి నుంచి తీర్థబిందెలతో జలాన్ని తీసుకొచ్చి కల్యాణ విగ్రహాలను అభిషేకిస్తారు. అనంతరం సుప్రభాత సేవ, నిత్యార్చన, పూజలు చేసిన అనంతరం 5.30 గంటలకు భక్తులకు సర్వదర్శనం కల్పిస్తారు. ఉదయం 10 గంటలకు సన్నాయి నృత్యమేళాలతో పల్లకిలో అలంకరించిన కల్యాణ విగ్రహాలను ఊరేగిస్తారు. ఆలయ ధర్మకర్త ద్వారంపూడి శ్రీరామ మురళీకృష్ణ శ్రీనివాసరెడ్డి ఇంటి నుంచి స్వామి వారి కల్యాణ సామగ్రి, ముత్యాల తలంబ్రాలు ఊరేగింపుగా కల్యాణ వేదిక వద్దకు తీసుకొస్తారు. ఉదయం 11.30 గంటల నుంచి కల్యాణ క్రతువు ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 12.30 నుంచి 1 గంట మధ్య మాంగల్యధారణ జరుగుతుంది. 1.30కు తలంబ్రాల కార్యక్రమం చేపట్టి, సాయంత్రం 4 గంటలకు అత్యంత వైభవంగా గ్రామోత్సవం నిర్వస్తామని కమిటీ సభ్యులు తెలిపారు.

*  పటిష్ట బందోబస్తు: భక్తులకు ఇబ్బందులు కలగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పెదపూడి ఎస్సై పి.వాసు తెలిపారు. 60 మంది సిబ్బందిని నియమించామన్నారు. తలంబ్రాల పంపిణీలో ఇబ్బంది లేకుండా కౌంటర్లు ఏర్పాటు చేశామన్నారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా కాకినాడ-పైన, పెద్దాడ-గండ్రేడు సెంటరు మీదుగా ట్రాఫిక్‌ను మళ్లిస్తామని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని