logo

నిమిషం ఆలస్యమైనా అనుమతి ఉండదు

జిల్లా వ్యాప్తంగా వచ్చే నెల 3వ తేదీ నుంచి 18వతేదీ వరకు పదోతరగతి పరీక్షల నిర్వహణకు పటిష్ఠమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ హిమాన్షు శుక్లా సమన్వయ కమిటీ సభ్యులను ఆదేశించారు.

Published : 30 Mar 2023 05:26 IST

పదోతరగతి పరీక్షలపై సమీక్షిస్తున్న కలెక్టర్‌ హిమాన్షు శుక్లా

అమలాపురం కలెక్టరేట్, న్యూస్‌టుడే: జిల్లా వ్యాప్తంగా వచ్చే నెల 3వ తేదీ నుంచి 18వతేదీ వరకు పదోతరగతి పరీక్షల నిర్వహణకు పటిష్ఠమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ హిమాన్షు శుక్లా సమన్వయ కమిటీ సభ్యులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో పరీక్షల నిర్వహణ, భద్రతా చర్యలు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఒక నిమిషం ఆలస్యంగా వచ్చినా విద్యార్థులను పరీక్షలకు అనుమతించేది లేదని విద్యాశాఖ అధికారులు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 374 పాఠశాలలకు చెందిన 20,967 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని, వీరికి 111 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. పరీక్షలు నిర్వహించే కేంద్రాల ఉన్న గ్రామాలకు వెళ్లే బస్సుల్లో విద్యార్థులు ఉచిత ప్రయాణం చేయవచ్చన్నారు. కేంద్రాల సమీపంలో ఉన్న జిరాక్స్‌ సెంటర్లను పరీక్ష ముగిసే వరకు మూసి ఉంచాలని ఆదేశాలు జారీ చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో వైద్యశిబిరంలో ఏర్పాటు చేయాలని, తాగునీరు, మౌలిక వసతులు కల్పించాలన్నారు. బుధవారం అమరావతి నుంచి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్‌, కమిషనర్‌ ఎస్‌.సురేష్‌ కుమార్‌ వివిధ జిల్లాల కలెక్టర్లతో దూరదృశ్య సమావేశం నిర్వహించి పదోతరగతి పరీక్షల సన్నదత, ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో సత్తిబాబు, డీఈవో కమలకుమారి, జిల్లా వైద్యాధికారి దుర్గారావు దొర, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని