logo

ఆలయాల్లో సుప్రీంకోర్టు న్యాయమూర్తి పూజలు

డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ద్రాక్షారామ భీమేశ్వరస్వామి వారి ఆలయాన్ని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వి.రామసుబ్రహ్మణియన్‌ దంపతులు గురువారం రాత్రి సందర్శించారు.

Published : 31 Mar 2023 03:33 IST

ద్రాక్షారామ భీమేశ్వరస్వామి వారి సన్నిధిలో జస్టిస్‌ రామసుబ్రహ్మణియన్‌ దంపతులు

ద్రాక్షారామ, పిఠాపురం, న్యూస్‌టుడే: డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ద్రాక్షారామ భీమేశ్వరస్వామి వారి ఆలయాన్ని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వి.రామసుబ్రహ్మణియన్‌ దంపతులు గురువారం రాత్రి సందర్శించారు. వీరికి పండితులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. మంత్రి వేణుగోపాలకృష్ణ వీరిని సాదరంగా ఆహ్వానించారు. స్వామి వారిని, మాణిక్యాంబ అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

వేద పండితుల ఆశీర్వచనాలు పొంది తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం కాకినాడ జిల్లా పిఠాపురంలోని పాదగయ క్షేత్రంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. కుక్కుటేశ్వరస్వామి, రాజరాజేశ్వరిదేవి, పురూహుతికా అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ఈవో వడ్డి శ్రీనివాసరావు, ఛైర్మన్‌ ఆగంటి ప్రభాకరరావు, అర్చకులు ప్రసాదం అందించారు. ఫస్ట్‌ అడిషనల్‌ జిల్లా జడ్జి (రాజమహేంద్రవరం) సునీత, ప్రొటోకాల్‌ మేజిస్ట్రేటు శ్రీనివాసరావు, ఎస్సీ, ఎస్టీ కోర్టు జడ్జి ఎం.నాగేశ్వరరావు, అడిషనల్‌ ఎస్పీ లతా మాధురి, రామచంద్రపురం జూనియర్‌ సివిల్‌జడ్జి బి.వాణిశ్రీ, ఆర్డీవో సింధు సుబ్రహ్మణ్యం, దేవాదాయశాఖ కోనసీమ జిల్లా సహాయ కమిషనర్‌ కేఎన్‌వీడీవీ ప్రసాద్‌, ఆలయ ఈవో పి.సత్యనారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని