logo

జానకీ నాయక.. భక్తజన పాలక

శ్రీరామ నవమి వేడుకలు డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా వ్యాప్తంగా గురువారం వైభవంగా జరిగాయి.

Published : 31 Mar 2023 03:33 IST

మండపేట: శ్రీసీతారామ క్షేత్రం వద్ద కల్యాణంలో పాల్గొన్న భక్తులు

శ్రీరామ నవమి వేడుకలు డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా వ్యాప్తంగా గురువారం వైభవంగా జరిగాయి. ఊరూవాడా సీతారాముల కల్యాణోత్సవంతో సందడిగా మారింది. ఉదయం నుంచే రాములోరి దర్శనానికి ఆలయాల్లో భక్తులు బారులుదీరారు. కోదండరాముని కల్యాణ వేడుకల్లో భాగంగా సాయంత్రం స్వామి, అమ్మవార్లను పల్లకిలో ఊరేగింపు నిర్వహించారు.

పి.గన్నవరంలో రాములోరి కల్యాణంలో ఏర్పాటు చేసిన కంత

జైశ్రీరామ్‌.. శ్రీరామ.. జయరామ.. అంటూ భక్తులు రామనామ స్మరణ చేశారు. ఆలయాల కమిటీల ఆధ్వర్యంలో కల్యాణ వేదికల వద్ద భక్తులకు ప్రసాదం, పానకం పంపిణీ చేశారు. పలుచోట్ల అన్నసమారాధనలు ఏర్పాటు చేశారు.

 న్యూస్‌టుడే, బృందం


అద్వితీయం

ధవళేశ్వరం: ఈస్ట్‌ ఇండియా కంపెనీ 1818లో శ్రీరామ పట్టాభిషేకం నాణేన్ని విడుదల చేసింది. దీనిపై రాముడు, సీత, లక్ష్మణుడు, ఆంజనేయ రూపాలున్నాయి. అప్పట్లో దీని విలువ అణా. బొమ్మూరుకు చెందిన అద్దంకి రాజాయోనా తమిళనాడులో దీన్ని సేకరించానని తెలిపారు.


చిన్నారులకు శ్రీరామరక్ష!

కల్యాణరాముడికి ఓ భక్తుడు కానుకగా ఇచ్చిన చిన్నారిని చూపుతున్న అర్చకుడు

పెదపూడి మండలం గొల్లలమామిడాడలోని కోదండరాముడి ఆలయంలో శ్రీరామ నవమినాడు జరిగిన సీతారాముల కల్యాణ మహోత్సవంలో ఓ భిన్నమైన సంప్రదాయం ఉంది. కొంతమంది భక్తులు తమ ఏడాదిలోపు చిన్నారులను స్వామివారికి కానుకగా ఇచ్చేస్తారు. అనంతరం తమకు తోచిన దక్షిణవేసి మళ్లీ తమ బిడ్డలను తీసుకొంటారు. ఇలా చేస్తే పిల్లలు ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉంటారనేది భక్తుల విశ్వాసం. ఇప్పుడీ విషయం ఊరూరా తెలిసి దూరప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు సైతం గురువారం జరిగిన శ్రీరామనవమి వేడుకల్లో ఈ ఆచారాన్ని పాటించారు.

 ఈనాడు, కాకినాడ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని