చూసిన కనులకు చూడముచ్చట
ఆజానుబాహుడు రామయ్య తండ్రితో అవనిజాత సీతమ్మవారి కల్యాణం ఊరంతా పందిర్లు వేశారు.. పచ్చని తోరణాలు కట్టారు... స్వామికి కల్యాణ తిలకం దిద్దారు అమ్మవారి బుగ్గన చుక్కపెట్టారు.
వేదికపై కల్యాణమూర్తులు
ఆజానుబాహుడు రామయ్య తండ్రితో అవనిజాత సీతమ్మవారి కల్యాణం ఊరంతా పందిర్లు వేశారు.. పచ్చని తోరణాలు కట్టారు... స్వామికి కల్యాణ తిలకం దిద్దారు అమ్మవారి బుగ్గన చుక్కపెట్టారు... భక్తులంతా ఆడపెళ్లివారి తరఫున రామయ్యకు పురోహితులే పెళ్లిపెద్దలు కంకణధారణ చేయించారు... వేడుకగా కన్యాదానం జరిపించారు... మాంగల్యధారణ.. ముత్యాల తలంబ్రాలు ప్రతి ఘట్టం ముచ్చటగా సాగింది... చలువ పందిర్లలో పానకం సేవించి అంతా అన్నప్రసాదాలు స్వీకరించారు ఇదీ.. గురువారం ఊరూరా నవమి సందడి
జి.మామిడాడ(పెదపూడి): పెదపూడి మండలం జి.మామిడాడ శ్రీ కోదండ రామచంద్రమూర్తి కల్యాణ మహోత్సవం గురువారం కనులపండువగా నిర్వహించారు. ఉదయం స్వామి వారికి శ్రీరామ పుష్కరిణి నీటితో అభిషేకం, నిత్యపూజలు నిర్వహించి ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. కల్యాణ విగ్రహాలకు గ్రామోత్సవం నిర్వహించి వేదిక వద్దకు తీసుకొచ్చారు. ఉదయం 11.30 గంటలకు కలెక్టర్ దంపతులు కృతికా శుక్లా(కాకినాడ జిల్లా), హిమాన్షు శుక్లా(డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా), అనపర్తి శాసనసభ్యుడు సూర్యనారాయణరెడ్డి, ఆదిలక్ష్మి దంపతులు స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. వేడుకను తిలకించేందుకు వచ్చిన సీఐడీ ఎస్పీ కె.వి.వి.సరితకు ఆలయ కమిటీ సభ్యులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయ వంశ పారంపర్య ధర్మకర్త ద్వారంపూడి శ్రీరామమురళీకృష్ణ శ్రీనివాసరెడ్డి ఇంటి నుంచి మంచి ముత్యాల తలంబ్రాలు, కల్యాణ సామగ్రికి గ్రామోత్సవం నిర్వహించి కల్యాణ వేదిక వద్దకు తీసుకువచ్చి స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించారు. మధ్యాహ్నం 12.30 గంటలకు గణపతి పూజతో కల్యాణ క్రతువు ప్రారంభించి రక్షాబంధనం, కన్యాదానం అనంతరం ఒంటి గంటకు సుముహూర్తం కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. మాంగల్యపూజ, మాంగల్యధారణ అనంతరం భక్తుల శ్రీరామ నామజపంతో ముత్యాల తలంబ్రాల కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. గ్రామస్థులు సేకరించిన కోటి గోటి తలంబ్రాలు స్వామి, అమ్మవార్లకు సమర్పించారు. వ్యాఖ్యాత తాడిశ్రీ కల్యాణ ఘట్టాన్ని భక్తులకు కమనీయంగా వివరించారు.
వేడుక తిలకించేందుకు తరలివచ్చిన భక్తజనం
భక్తుల తొక్కిసలాట
జి.మామిడాడ శ్రీ కోదండ రాముని కల్యాణ మహోత్సవంలో పాల్గొన్న భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భక్తులు కూర్చొనేందుకు చలువ పందిర్లు ఏర్పాటు చేసినా గాలి లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉచితంగా పంపిణీ చేసే విసనకర్రల కేంద్రం వద్ద భక్తులు ఇబ్బందులు పడ్డారు. కల్యాణం ముగిసిన తరవాత తలంబ్రాల పంపిణీలో తొక్కిసలాట జరగటంతో చిన్న పిల్లలు నలిగిపోయారు. తలంబ్రాల పంపిణీకి మూడు కౌంటర్లు ఏర్పాటు చేస్తామని ముందుగా కమిటీ వారు చెప్పినా అది జరగక, తలంబ్రాలు అందలేదని పలువురు భక్తులు వాపోయారు.
స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పణ
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Weather Report: తెలంగాణలో రాగల 3రోజులు ఉరుములు, మెరుపులతో వర్షాలు
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Movies News
Jayanth C Paranjee: త్రిషకు వేరే వ్యక్తితో పెళ్లి చేయడం వాళ్లకు నచ్చలేదు: జయంత్ సి.పరాన్జీ
-
India News
Odisha Train Accident: మృతులు 288 కాదు.. 275 మంది: ఒడిశా ప్రభుత్వం క్లారిటీ
-
Politics News
Bandi sanjay: తెదేపాతో భాజపా పొత్తు ఊహాగానాలే..: బండి సంజయ్
-
India News
Guwahati airport: కేంద్ర మంత్రి ప్రయాణిస్తున్న విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్