logo

నగరంలో మహిళా మార్ట్‌లు

డ్వాక్రా మహిళలు, స్వయంగా నిర్వహించుకునేలా డిపార్ట్‌మెంటల్‌ స్టోర్స్‌ తరహాలో మహిళా మార్ట్‌లు ఏర్పాటు చేసేందుకు నగరపాలక సంస్థ మెప్మా విభాగం ప్రణాళిక రూపొందించింది.

Published : 31 Mar 2023 03:33 IST

రాజమహేంద్రవరం నగర

పాలక సంస్థ: డ్వాక్రా మహిళలు, స్వయంగా నిర్వహించుకునేలా డిపార్ట్‌మెంటల్‌ స్టోర్స్‌ తరహాలో మహిళా మార్ట్‌లు ఏర్పాటు చేసేందుకు నగరపాలక సంస్థ మెప్మా విభాగం ప్రణాళిక రూపొందించింది. ‘జగనన్న మహిళా మార్ట్‌’ పేరుతో పట్టణ ప్రాంతాల్లో డ్వాక్రా మహిళలే వీటిని నిర్వహించేలా ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా నగరంలో వీటిని ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ముందుగా ప్రయోగాత్మకంగా గోకవరం బస్టాండ్‌ వద్ద మున్సిపల్‌ కాంప్లెక్స్‌లో మార్ట్‌ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆ తర్వాత మరిన్ని అందుబాటులోకి తీసుకొస్తారు.

* నగరంలో 6,500 డ్వాక్వా సంఘాలు ఉన్నాయి. ప్రతి సంఘంలో పది మంది మహిళా సభ్యులు ఉంటారు. మార్ట్‌ ఏర్పాటులో భాగంగా ఆసక్తి గల సభ్యుల నుంచి తొలిసారిగా రూ.150 వసూలు చేస్తారు. అందరూ ధనం చెల్లిస్తే రూ.97.50 లక్షలు సమకూరుతుంది. ఆ మొత్తంతో మార్ట్‌ ఏర్పాటు చేస్తారు. మూడేళ్ల వరకూ లాభాలు నిల్వ చేస్తారు. ఆ తర్వాత సొమ్ము అందించిన డ్వాక్రా మహిళలకు ఏడాదికోసారి నిర్దేశించిన లాభాలను పంచుతారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు మెప్మా కార్యక్రమం మేనేజరు రవిశంకర్‌ తెలిపారు.

* కమిటీల ఏర్పాటు: మహిళా మార్ట్‌ ఏర్పాటుకు డ్వాక్వా మహిళలతో కమిటీలు ఏర్పాటు చేస్తున్నారు. నిర్వహణ బాధ్యతలను కమిటీలకు అప్పగిస్తారు. డిపార్ట్‌మెంటల్‌ స్టోర్స్‌ తరహాలో అన్ని రకాల వస్తువులు అందుబాటులోకి తీసుకొస్తారు. ఇప్పటికే ప్రభుత్వం వివిధ సంస్థలతో టోకు అమ్మకాల నిమిత్తం ఒప్పందం కుదుర్చుకుంది. ఐటీసీ, అమూల్‌ తదితర సంస్థలు ఒప్పందం మేరకు టోకు ధరలకు వస్తువులు అందిస్తారు. నిత్యావసర సరకులు, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌ వస్తువులు, గృహోపకరణాలు, ఇతర అన్నిరకాల వస్తువులు ఈ మార్ట్‌లలో ఒకేచోట లభ్యమవుతాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని