logo

మాలమహానాడు నాయకుల నిర్బంధం

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మాల మహానాడు పిలుపు మేరకు కాకినాడ జిల్లా శృంగవృక్షం గ్రామానికి వెళ్లేందుకు సిద్ధమైన ఆ వర్గ నాయకులను గురువారం మధ్యాహ్నం పోలీసులు అడ్డుకుని స్టేషన్‌లో ఉంచారు.

Published : 31 Mar 2023 03:33 IST

సీఐతో మాట్లాడుతున్న మాల మహానాడు రాష్ట్ర నాయకులు

రాజమహేంద్రవరం నేరవార్తలు: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మాల మహానాడు పిలుపు మేరకు కాకినాడ జిల్లా శృంగవృక్షం గ్రామానికి వెళ్లేందుకు సిద్ధమైన ఆ వర్గ నాయకులను గురువారం మధ్యాహ్నం పోలీసులు అడ్డుకుని స్టేషన్‌లో ఉంచారు. దళిత యువకుడు నడిపల్లి రాము హత్య జరిగిన నేపథ్యంలో ఆ కుటుంబానికి సంఘీభావం తెలిపేందుకు బయలుదేరిన 14 మంది ఎస్సీ, ఎస్టీ సంఘాల నాయకులను రాజమహేంద్రవరం రెండో పట్టణ పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. రాష్ట్ర అధ్యక్షుడు బెతాళ్ల సరోజ్‌ శరత్‌బాబు, ప్రధాన కార్యదర్శి బండ్లమూడి స్టాలిన్‌బాబు, నాయకులు బత్తుల వీరాస్వామి, తుమ్మల ఫ్రాన్సిస్‌, మల్లెల వెంకటరావు, జెర్రిపోతుల అరవింద్‌, గోళ్ల అరుణ్‌కుమార్‌, దొడ్డ సాగర్‌బాబు, గోదా జాన్‌పాల్‌, దారా హేమప్రసాద్‌, బేతాళ్ల శేఖర్‌బాబు, రొంపిచర్ల ఆంటోనీ, మర్రె సుహానెలాల్‌, కొటే సందీప్‌, మెరగల సతీష్‌లను స్టేషన్‌లో నిర్బంధించారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్‌ అక్రమ నిర్బంధాలను ఖండిస్తూ స్టేషన్‌కు వెళ్లి మాల మహానాడు నాయకులను పరామర్శించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు