logo

వసతుల కల్పనలో జిల్లా రెడ్‌క్రాస్‌ అగ్రగామి

విభిన్న సేవలతో రాష్ట్రంలో అగ్రగామిగా ఉన్న రెడ్‌క్రాస్‌ కాకినాడ జిల్లా శాఖ మౌలిక వసతుల నిర్మాణంలోనూ అద్భుతమైన ప్రగతి సాధించిందంటూ కలెక్టర్‌, రెడ్‌క్రాస్‌ జిల్లా శాఖ అధ్యక్షురాలు కృతికాశుక్లా ఆనందం వ్యక్తం చేశారు.

Published : 31 Mar 2023 03:33 IST

రెడ్‌క్రాస్‌ ప్రాంగణంలో నిర్మించిన భవనాన్ని ప్రారంభిస్తున్న కలెక్టర్‌ కృతికాశుక్లా

గాంధీనగర్‌, న్యూస్‌టుడే: విభిన్న సేవలతో రాష్ట్రంలో అగ్రగామిగా ఉన్న రెడ్‌క్రాస్‌ కాకినాడ జిల్లా శాఖ మౌలిక వసతుల నిర్మాణంలోనూ అద్భుతమైన ప్రగతి సాధించిందంటూ కలెక్టర్‌, రెడ్‌క్రాస్‌ జిల్లా శాఖ అధ్యక్షురాలు కృతికాశుక్లా ఆనందం వ్యక్తం చేశారు. గాంధీనగర్‌ రెడ్‌క్రాస్‌ ప్రాంగణంలో 35 లక్షలతో నిర్మించిన మూడంతస్తుల పార్కింగ్‌ సముదాయం, ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ, ప్రథమ చికిత్స కేంద్రాల భవనాన్ని గురువారం కలెక్టర్‌ చేతుల మీదుగా ప్రారంభించారు. రిలయన్స్‌ తరఫున ఆ సంస్థ ప్రతినిధి సబ్రహ్మణ్యం  రూ.8లక్షల విలువైన అంబులెన్స్‌ను కలెక్టర్‌కు అందజేశారు. నూతన భవనాన్ని పరిశీలించిన అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లా రెడ్‌క్రాస్‌ సంస్థ బ్లడ్‌బ్యాంకు, తలసేమియా సేవా కేంద్రం, విభిన్న ప్రతిభావంతుల పాఠశాల, వృద్ధాశ్రమం వంటి సేవా సంస్థలను నిర్వహిస్తూ, మౌలిక వసతుల కల్పనలో రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉండటం గర్వకారణమన్నారు. రెడ్‌క్రాస్‌ ఛైర్మన్‌ వైడి.రామారావు,  సంస్థ ఇంజినీర్‌, పాలకవర్గ సభ్యుడు చంద్రశేఖర్‌, కార్యదర్శి కె.శివకుమార్‌, సభ్యులు భానుమతి, విశ్వేశ్వరరావు, వైద్యులు దుర్గరాజు, రామకృష్ణ పరాశర, సిబ్బంది పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని