logo

ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలకు 4న రుణాలు

జిల్లా ఏర్పడి ఈ నెల 4వ తేదీ నాటికి ఏడాది పూర్తవుతున్నందున అదేరోజు జిల్లాలోని ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలకు సూక్ష్మ తరహా పరిశ్రమల స్థాపన నిమిత్తం రుణాలు మంజూరు చేయనున్నట్లు కలెక్టర్‌ మాధవీలత తెలిపారు.

Published : 01 Apr 2023 05:20 IST

సమావేశంలో చర్చిస్తున్న కలెక్టర్‌, ఆయా శాఖల అధికారులు

వి.ఎల్‌.పురం(రాజమహేంద్రవరం): జిల్లా ఏర్పడి ఈ నెల 4వ తేదీ నాటికి ఏడాది పూర్తవుతున్నందున అదేరోజు జిల్లాలోని ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలకు సూక్ష్మ తరహా పరిశ్రమల స్థాపన నిమిత్తం రుణాలు మంజూరు చేయనున్నట్లు కలెక్టర్‌ మాధవీలత తెలిపారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జిల్లా పరిశ్రమల అభివృద్ధి కమిటీ సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఇప్పటికే పలువురు మహిళలు పరిశ్రమల స్థాపనకు ముందుకు రాగా 100 మంది దరఖాస్తులను బ్యాంకులు ఆమోదించాయన్నారు. సుమారు రూ.3 కోట్లతో వీరు స్థాపించే పరిశ్రమల ద్వారా మరో 300 నుంచి 500 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుందన్నారు. అనంతరం గత సమావేశాల్లో చర్చించిన అంశాలపై తీసుకున్న నిర్ణయాలను అధికారులు సమావేశం ముందుంచారు. ప్రధానమంత్రి ఉద్యోగ కల్పన ఆవాస్‌ యోజన యూనిట్లు 275 మంజూరు చేయగా వీటిలో ఇప్పటివరకు 192 యూనిట్లు ఏర్పాటైనట్లు తెలిపారు. సింగిల్‌ విండో కింద 69 దరఖాస్తులు రాగా 33 అనుమతులు ఇవ్వగా మిగతావి పరిశీలనలో ఉన్నాయన్నారు. మహిళా పారిశ్రామిక రంగం అభివృద్ధికి వివిధ పథకాల కింద 165 దరఖాస్తులు రాగా వాటిని ఆమోదించి బ్యాంకులకు సిఫార్సు చేసినట్లు కలెక్టర్‌ తెలిపారు. సమావేశంలో సమన్వయ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని