logo

వెంకన్న కల్యాణోత్సవాలకు అంకురార్పణ

కోనసీమ తిరుపతిగా పేరొందిన వాడపల్లిలో వేంకటేశ్వరస్వామి దివ్య కల్యాణోత్సవాలు శుక్రవారం వైభవంగా ప్రారంభమయ్యాయి.

Published : 01 Apr 2023 05:20 IST

ధ్వజారోహణం

ఆత్రేయపురం: కోనసీమ తిరుపతిగా పేరొందిన వాడపల్లిలో వేంకటేశ్వరస్వామి దివ్య కల్యాణోత్సవాలు శుక్రవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. పండితుడు ఖండవిల్లి రాజేశ్వర వరప్రసాదాచార్యులు ఆధ్వర్యంలో గౌతమీ గోదావరి నుంచి మేళతాళాల నడుమ ఊరేగింపుగా పుట్టమన్ను తెచ్చి నవధాన్యాలు పోసి అంకురార్పణ చేశారు. ఉత్సవ ప్రత్యేక అధికారి సింగం రాధ, పాలక మండలి ఛైర్మన్‌ రుద్రరాజు రమేష్‌రాజు, ఈవో ముదునూరి సత్యనారాయణరాజు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో శనివారం మధ్యాహ్నం 3 గంటలకు రథోత్సవం, రాత్రి 7 గంటలకు వేంకటేశ్వరస్వామి కల్యాణం నిర్వహిస్తారు.   స్వామివారి కల్యాణం నిర్వహించే శ్రీనివాస ప్రాంగణాన్ని విద్యుత్తు కాంతులతో సుందరంగా తీర్చిదిద్దారు.

విశేష పుష్పాలంకరణలో స్వామివారు

నేడు 6 గంటల వరకే దర్శనాలు

వేంకటేశ్వరుని కల్యాణోత్సవాల సందర్భంగా శనివారం స్వామివారి దర్శనాలు ఉదయం 4 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, తర్వాత సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు మాత్రమే ఉంటాయని ఈవో ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు. 6 గంటల తర్వాత స్వామివారిని ఉభయదేవేరులతో శ్రీనివాస కల్యాణ ప్రాంగణానికి తీసుకువెళ్తారని చెప్పారు. ఈ విషయం ఏడు శనివారాల నోము ఆచరించే భక్తులు గమనించాలని సూచించారు.

వేడుక తిలకించేందుకు వచ్చే భక్తులకు కుర్చీలు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని