logo

కవి, పండితుడు కేసాప్రగడ కన్నుమూత

అష్టావధాని, కవి పండితుడు, విశ్రాంత ప్రిన్సిపల్‌ కేసాప్రగడ సత్యనారాయణ(74) శుక్రవారం రాత్రి తుది శ్వాస విడిచారు.

Published : 01 Apr 2023 05:20 IST

సత్యనారాయణ

రాజమహేంద్రవరం సాంస్కృతికం: అష్టావధాని, కవి పండితుడు, విశ్రాంత ప్రిన్సిపల్‌ కేసాప్రగడ సత్యనారాయణ(74) శుక్రవారం రాత్రి తుది శ్వాస విడిచారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో ఉన్న ఆయన అమలాపురం కిమ్స్‌ ఆసుపత్రిలో చనిపోయారు. ఆయన పార్థివ దేహాన్ని దివాన్‌ చెరువు డి.బి.వి.రాజు టౌన్‌ షిప్‌ సమీపాన ఉన్న స్వగృహానికి చేరుస్తున్నారు. ఉభయ భాషా పండితులైన కేసాప్రగడ రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలను అభ్యసించి పలు వేదికలపై ప్రవచనాలు చేశారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. శనివారం అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని