logo

మరో 3 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు

జిల్లాలో 3 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు జిల్లా వైద్యాధికారులు శనివారం తెలిపారు. పెదపూడి మండలం రామేశ్వరం రైల్వేగేటు సమీపానికి చెందిన 34 ఏళ్ల మహిళ, 12 ఏళ్ల బాలుడు, 7 ఏళ్ల బాలికలకు జీజీహెచ్‌లో పరీక్ష చేయగా కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చిందన్నారు.

Published : 02 Apr 2023 04:29 IST

మసీదు సెంటర్‌ (కాకినాడ): జిల్లాలో 3 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు జిల్లా వైద్యాధికారులు శనివారం తెలిపారు. పెదపూడి మండలం రామేశ్వరం రైల్వేగేటు సమీపానికి చెందిన 34 ఏళ్ల మహిళ, 12 ఏళ్ల బాలుడు, 7 ఏళ్ల బాలికలకు జీజీహెచ్‌లో పరీక్ష చేయగా కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చిందన్నారు. గత బుధవారం వీరి బంధువైన 45 ఏళ్ల మహిళకు కరోనా సోకింది. దాంతో ఆమె కాంటాక్ట్‌లకు పరీక్షలు నిర్వహించడంతో ఈ కేసులు నమోదయ్యాయన్నారు. అధికారులు 3 శాంపిల్స్‌ను ఇతర పరీక్షల నిమిత్తం విజయవాడ ల్యాబ్‌కు పంపనున్నారు. అనుమానిత లక్షణాలున్న 68 మందికి కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు జిల్లా సర్వేలెన్స్‌ అధికారి(డీఎస్‌వో) డా.బండారు రవికుకుమార్‌ తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో 7 కొవిడ్‌ యాక్టివ్‌ కేసులు ఉన్నాయన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు