logo

మధ్యాహ్న భోజనం తిన్నాకే ఇళ్లకు విద్యార్థులు

జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలలకు ప్రభుత్వం ఈ నెల మూడో తేదీ నుంచి చివరి పనిదినం ఏప్రిల్‌ 30 వరకు ఒంటిపూట తరగతులు ప్రకటించినట్లు జిల్లా విద్యాశాఖాధికారి ఎం.కమలకుమారి తెలిపారు.

Published : 02 Apr 2023 04:29 IST

ముమ్మిడివరం: జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలలకు ప్రభుత్వం ఈ నెల మూడో తేదీ నుంచి చివరి పనిదినం ఏప్రిల్‌ 30 వరకు ఒంటిపూట తరగతులు ప్రకటించినట్లు జిల్లా విద్యాశాఖాధికారి ఎం.కమలకుమారి తెలిపారు. ఉదయం 7.45 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పాఠశాలలు పనిచేయాలని, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టి పంపాలన్నారు. పదో తరగతి పరీక్షలు జరిగే పాఠశాలల్లో ఏ విధమైన తరగతులు నిర్వహించవద్దని, పాఠశాలకు పూర్తి సెలవు ఇచ్చి ఈ నెల 30వ తేదీలోగా వచ్చే సెలవు దినాల్లో పాఠశాలలు నిర్వహించాలని డీఈఓ తెలిపారు. వేసవి దృష్ట్యా విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా అన్ని పాఠశాలల్లోనూ తాగునీరు ఏర్పాటు చేసుకోవాలని, వైద్యారోగ్యశాఖ సహకారంతో ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని డీఈఓ సూచించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు