logo

నైపుణ్య కళాశాలలో ప్రవేశాలకు అవకాశం

స్థానిక ఎయిమ్స్‌లో ఏర్పాటైన ప్రభుత్వ నైపుణ్య కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా నైపుణ్య అధికారి పి.లోక్‌మాన్‌ ప్రకటనలో తెలిపారు.

Published : 02 Apr 2023 04:29 IST

ముమ్మిడివరం: స్థానిక ఎయిమ్స్‌లో ఏర్పాటైన ప్రభుత్వ నైపుణ్య కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా నైపుణ్య అధికారి పి.లోక్‌మాన్‌ ప్రకటనలో తెలిపారు. పేషెంట్‌ రిలేషన్‌ సర్వీస్‌ డ్యూటీ మేనేజర్‌ కోర్సుకు బీఎస్సీ/ఎంఎస్సీ పూర్తి చేసిన అభ్యర్థులు, పేషెంట్‌ రిలేషన్‌ అసోసియేట్‌ కోర్సుకు ఏదైనా డిగ్రీ చదివిన 18-30 సంవత్సరాల వయసు గల యువతీయువకులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అభ్యర్థులు స్క్రీనింగ్‌ పరీక్ష కోసం ఈనెల మూడో తేదీన స్థానిక ఏపీఎస్‌ఎస్‌డీసీ స్కిల్‌ కళాశాల వద్ద హాజరు కావాలని, దరఖాస్తులను shorturl.at/bmtz5  లింకు ద్వారా రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చని ఆయన తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని