logo

కొబ్బరి ఆధారిత పరిశ్రమలను ప్రోత్సహించాలి

కోనసీమ ప్రాంతం కొబ్బరి ఆధారిత ప్రాంతమైనందున ఇక్కడ కొబ్బరి ఆధారిత పరిశ్రమల స్థాపనను ప్రోత్సహించాలని సలహా మండలి సభ్యులకు కలెక్టర్‌ హిమాన్షుశుక్లా సూచించారు.

Published : 02 Apr 2023 04:29 IST

అమలాపురం కలెక్టరేట్: కోనసీమ ప్రాంతం కొబ్బరి ఆధారిత ప్రాంతమైనందున ఇక్కడ కొబ్బరి ఆధారిత పరిశ్రమల స్థాపనను ప్రోత్సహించాలని సలహా మండలి సభ్యులకు కలెక్టర్‌ హిమాన్షుశుక్లా సూచించారు. శనివారం కలెక్టరేట్‌లో జిల్లా పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక మండలి సమావేశం నిర్వహించి పలు అంశాలపై సమీక్ష నిర్వహించారు. పంట కాలువల్లో గుర్రపు డెక్క, ఇతర వ్యర్థాలు తొలగించే ఎక్స్‌-200 వాహనాల కొనుగోలును ప్రోత్సహించాలన్నారు. జగనన్న బడుగు వికాసం, ప్రధాన మంత్రి ఉపాధి కల్పనలో వచ్చిన దరఖాస్తులపై సమీక్ష నిర్వహించారు. జగనన్న బడుగు వికాసంలో 24 క్లెయిమ్‌లకు రూ.3.70 కోట్లు మంజూరు చేశామన్నారు. గత నవంబరు వరకు జిల్లాలో పరిశ్రమలశాఖ ద్వారా 117, ఖాదీ విలేజ్‌ ఇండస్ట్రీస్‌ బోర్టు ద్వారా 47, కమిషన్‌ ద్వారా 25, క్వాయర్‌ బోర్డు పరిశ్రమల ద్వారా 28 యూనిట్లకు నిధులు మంజూరు చేసినట్లు అధికారులు తెలిపారు.
పరిశ్రమలశాఖ అధికారి మురళి, ఎల్డీఎం లక్ష్మీనారాయణ, మధుసూదన్‌, షేక్‌లాల్‌ మహ్మద్‌ పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు