logo

33 మంది జనసేన శ్రేణులపై కేసు

తూర్పుగోదావరి జల్లా కోరుకొండలో ట్రాఫిక్‌కు అడ్డు తగిలి, ప్రజలను ఇబ్బంది పెట్టారనే ఆరోపణపై 33 మంది జనసేన శ్రేణులపై కేసు నమోదు చేశామని ఎస్‌ఐ కట్టా శారదా సతీష్‌ శనివారం తెలిపారు.

Published : 02 Apr 2023 04:29 IST

కోరుకొండ, న్యూస్‌టుడే: తూర్పుగోదావరి జల్లా కోరుకొండలో ట్రాఫిక్‌కు అడ్డు తగిలి, ప్రజలను ఇబ్బంది పెట్టారనే ఆరోపణపై 33 మంది జనసేన శ్రేణులపై కేసు నమోదు చేశామని ఎస్‌ఐ కట్టా శారదా సతీష్‌ శనివారం తెలిపారు. తాగునీటి విషయంలో జనసేన శ్రేణులు కోరుకొండ ప్రధాన రహదారిని నిర్బంధించి ఆందోళన చేశారన్నారు. ఈ సమయంలో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగిందని, అనుమతి లేకుండా రోడ్డెక్కి ధర్నాకు దిగిన బత్తుల బలరామకృష్ణ, వెంకటలక్ష్మి, గోపాలకృష్ణ తదితర 13 మంది పేర్లతోనూ, వారి అనుచరులు మరో 20 మందిపైనా కేసు నమోదు చేశామన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని