‘రాక్షస పాలనకు చరమగీతం పాడాలి’
ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలకు హామీలిచ్చి, వాటిని మరచి తనకు కావలసిన ఆస్తులను సంపాదించుకుంటున్నాడని అలాంటి రాక్షస పాలనకు ప్రజలు చరమగీతం పాడాలని, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కోరారు.
కేఈచిన్నాయిపాలెంలో మాట్లాడుతున్న యనమల
కోటనందూరు: ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలకు హామీలిచ్చి, వాటిని మరచి తనకు కావలసిన ఆస్తులను సంపాదించుకుంటున్నాడని అలాంటి రాక్షస పాలనకు ప్రజలు చరమగీతం పాడాలని, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కోరారు. మండలంలోని కేఈచిన్నాయిపాలెంలో శనివారం రాత్రి కార్యకర్తలతో సమావేశం ఏర్పాటుచేశారు. రామకృష్ణుడు మాట్లాడుతూ..ఎన్నికలు వస్తున్నాయనే భావంతో పనిచేయని బటన్లు నొక్కుతూ మోసం చేస్తున్నారన్నారు. వైకాపా ప్రభుత్వం అరాచకపాలన సాగిస్తుందన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దివాలాతీసిందని, ఒక్కొక్కరికి సుమారు రూ.5 లక్షలు భారం పడుతుందన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయని, ముఖ్యంగా మహిళలందరూ దీన్ని గమనించి రానున్న ఎన్నికలలో తెదేపా గెలుపునకు సహకరించాలన్నారు. రాష్ట్ర తెదేపాఆర్గనైజింగ్ కార్యదర్శి యనమల కృష్ణుడు, తుని నియోజక వర్గ పార్టీ ఇన్‌ఛార్జి యనమల దివ్య, జిల్లా తెలుగుయువత ప్రధాన కార్యదర్శి యనమల శివరామకృష్ణన్, తెదేపా నాయకులు గాడిరాజబాబు, అంకంరెడ్డి రమేష్, లెక్కల భాస్కర్, బోడపాటి సత్యనారాయణ, తెదేపా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Politics News
Congress: చేతులేనా.. చేతల్లోనూనా!: గహ్లోత్, పైలట్ మధ్య సయోధ్యపై సందేహాలు
-
Crime News
దారుణం.. భార్యపై అనుమానంతో శిశువుకు పురుగుల మందు ఎక్కించాడు!
-
Ts-top-news News
పీఎం స్వనిధి ఉత్సవాలకు వరంగల్ చాయ్‌వాలా.. సిరిసిల్ల పండ్ల వ్యాపారి
-
Ap-top-news News
Chandrababu-AP CID: చంద్రబాబు నివాసం జప్తునకు అనుమతి కోరిన ఏపీ సీఐడీ
-
Ts-top-news News
Dharani portal: ధరణిలో ఊరినే మాయం చేశారు