logo

రెడ్‌క్రాస్‌కు రూ.40 లక్షల విరాళం

ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీకి ఆదిత్య విద్యా సంస్థల విద్యార్థులు రూ.40 లక్షల విరాళాన్ని అందజేశారు. టర్కీ భూకంపం వంటి ప్రకృతి వైపరీత్యాల బాధితులకు సహాయం అందించేందుకు విద్యార్థులు ఈ విరాళాన్ని సమకూర్చారు.

Published : 02 Apr 2023 05:02 IST

కలెక్టర్‌ కృతికాశుక్లాకు డీడీ అందజేస్తున్న సుగుణారెడ్డి, వై.డి.రామారావు

కాకినాడ కలెక్టరేట్‌: ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీకి ఆదిత్య విద్యా సంస్థల విద్యార్థులు రూ.40 లక్షల విరాళాన్ని అందజేశారు. టర్కీ భూకంపం వంటి ప్రకృతి వైపరీత్యాల బాధితులకు సహాయం అందించేందుకు విద్యార్థులు ఈ విరాళాన్ని సమకూర్చారు. దీనికి సంబంధించి డిమాండ్‌ డ్రాఫ్టును శనివారం కలెక్టరేట్‌లో కలెక్టర్‌, రెడ్‌క్రాస్‌ జిల్లా శాఖ అధ్యక్షురాలు కృతికాశుక్లాకు రెడ్‌క్రాస్‌ జిల్లా శాఖ ఛైర్మన్‌ వై.డి.రామారావు, ఆదిత్య విద్యా సంస్థల కార్యదర్శి ఎన్‌.సుగుణారెడ్డి అందజేశారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ఈ విరాళాన్ని త్వరలో రాష్ట్ర గవర్నర్‌, రెడ్‌క్రాస్‌ రాష్ట్రశాఖ అధ్యక్షుడు సయ్యద్‌ అబ్దుల్‌ నజీర్‌కు అందజేయనున్నట్లు చెప్పారు. ఇంతటి భూరి విరాళాన్ని అందజేసిన ఆదిత్య విద్యా సంస్థల ఛైర్మన్‌ ఎన్‌.శేషారెడ్డి, విద్యార్థులకు కలెక్టర్‌ అభినందనలు తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని