logo

మాదక ద్రవ్యాలు విక్రయిస్తే ఆస్తుల జప్తు

గంజాయి, మాదక ద్రవ్యాల సరఫరాపై జిల్లాలో పూర్తిస్థాయి నిఘా ఏర్పాటు చేసినట్లు కలెక్టర్‌ మాధవీలత చెప్పారు.

Published : 02 Apr 2023 05:02 IST

టి.నగర్‌(రాజమహేంద్రవరం): గంజాయి, మాదక ద్రవ్యాల సరఫరాపై జిల్లాలో పూర్తిస్థాయి నిఘా ఏర్పాటు చేసినట్లు కలెక్టర్‌ మాధవీలత చెప్పారు. మాదక ద్రవ్యాల మహమ్మారిని ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టరేట్‌లో శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ మాదక ద్రవ్యాలు విక్రయించే వారిపై కేసులు నమోదు చేస్తామని, వారితో పాటు బంధువుల ఆస్తులు జప్తు చేస్తామన్నారు. బ్యాంకు ఖాతాలను నిలిపివేస్తామన్నారు. వీలైనంత త్వరగా అన్ని కెమిస్ట్‌లు, ఫార్మసీ దుకాణాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు.  జిల్లా ఇన్‌ఛార్జి ఎస్పీ సుధీర్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ 2019 నుంచి ఈ ఏడాది మార్చి 30 వరకూ జిల్లాలో ఎన్‌డీపీ చట్టం ప్రకారం 215 కేసులు నమోదుచేసి 699 మందిని అరెస్టు చేశామన్నారు. సమావేశంలో డీఆర్‌ఓ నరసింహులు, ఎస్‌ఈబీ అధికారి సోమశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు