logo

దాడి ఘటనపై భాజపా ఆందోళన

భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌పై దాడిని నిరసిస్తూ రాజమహేంద్రవరంలోని కలెక్టరేట్‌ ఎదుట ఆ పార్టీ జిల్లా నాయకులు, కార్యకర్తలు శనివారం ధర్నా నిర్వహించారు.

Published : 02 Apr 2023 05:02 IST

కలెక్టర్‌ కార్యాలయం వద్ద ధర్నా

దేవీచౌక్‌(రాజమహేంద్రవరం): భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌పై దాడిని నిరసిస్తూ రాజమహేంద్రవరంలోని కలెక్టరేట్‌ ఎదుట ఆ పార్టీ జిల్లా నాయకులు, కార్యకర్తలు శనివారం ధర్నా నిర్వహించారు. భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు బొమ్ముల దత్తు మాట్లాడుతూ అమరావతి రైతుల దీక్షకు సంఘీభావం తెలిపి తిరిగి వెళుతున్న సత్యకుమార్‌ వాహన శ్రేణిపై దాడికి పాల్పడి భాజపా నాయకులు, కార్యకర్తలను గాయపరచడం దారుణమన్నారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రేలంగి శ్రీదేవి మాట్లాడుతూ పోలీసుల సమక్షంలోనే దాడి చేయడం పోలీసు వ్యవస్థకు సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, అధికార పార్టీ నాయకులు ఏం చెబితే పోలీసులు అది చేస్తున్నారని ఆరోపించారు. దేశంలో అధికారంలో ఉన్న జాతీయ స్థాయి పార్టీ నాయకుడిపైనే వైకాపా కిరాయి గూండాలు దాడికి తెగబడితే ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. అనంతరం నాయకులంతా వెళ్లి కలెక్టరేట్‌లో వినతిపత్రం అందజేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని