logo

170 చరవాణుల రికవరీ

పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చాట్‌ బోట్‌ సేవలకు మంచి స్పందన వస్తోందని జిల్లా ఇన్‌ఛార్జి ఎస్పీ సీహెచ్‌ సుధీర్‌కుమార్‌ రెడ్డి తెలిపారు.

Published : 02 Apr 2023 05:04 IST

బాధితుడికి సెల్‌ఫోను అందిస్తున్న ఇన్‌ఛార్జి ఎస్పీ    

రాజమహేంద్రవరం నేరవార్తలు: పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చాట్‌ బోట్‌ సేవలకు మంచి స్పందన వస్తోందని జిల్లా ఇన్‌ఛార్జి ఎస్పీ సీహెచ్‌ సుధీర్‌కుమార్‌ రెడ్డి తెలిపారు. చాట్‌ బోట్‌కు ఇటీవల కాలంలో వచ్చిన ఫిర్యాదులతో రెండో విడతగా 170 సెల్‌ఫోన్లు(చరవాణులను) రికవరీ చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. రాజమహేంద్రవరం జాంపేట మహిళా పోలీసు స్టేషన్‌లో శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చరవాణులు ఆయా బాధితులకు అందజేశారు. ఇప్పటి వరకు రెండు విడతలుగా మొత్తం 290 చరవాణులు రికవరీ చేశామన్నారు. సెల్‌ ట్రాకింగ్‌ బృందాన్ని అభినందించారు. కార్యక్రమంలో ఏఎస్పీలు ఎం.రజనీ, జి.వెంకటేశ్వరరావు, డీఎస్పీ గురునాథ్‌బాబు తదితరులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు