logo

‘వైకాపా పాలనలో యువత నైరాశ్యం’

తెదేపా యువతకు భరోసానిస్తే, వైకాపా ప్రభుత్వం వారిని నైరాశ్యంలోకి దింపిందని తెదేపా జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కేఎస్‌ జవహర్‌ ఆరోపించారు.

Published : 02 Apr 2023 05:08 IST

మాట్లాడుతున్న మాజీ మంత్రి జవహర్‌, తెదేపా నాయకులు

కొవ్వూరు పట్టణం, న్యూస్‌టుడే: తెదేపా యువతకు భరోసానిస్తే, వైకాపా ప్రభుత్వం వారిని నైరాశ్యంలోకి దింపిందని తెదేపా జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కేఎస్‌ జవహర్‌ ఆరోపించారు. కొవ్వూరులోని పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన మాట్లాడారు. అతి త్వరలో రానున్న ఎన్నికల్లో తెదేపా విజయభేరి మోగిస్తుందన్నారు. ప్రాధాన్యం గల పరిశ్రమల్లో ఉపాధి అవకాశాలతో పూర్వవైభవం తీసుకొస్తుందన్నారు. విశాఖలో సమ్మిట్‌ పెట్టామని ప్రభుత్వం ప్రగల్భాలు పలుకుతోందని, నెల రోజులైనా ఒక్క పరిశ్రమ, పెట్టుబడి పెట్టిన దాఖలాలు లేవన్నారు. అమర్‌రాజా వంటి ప్రఖ్యాతి గాంచిన పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు వెళ్లిపోతున్నాయని, సుమారు 25 వేల మంది ఉపాధి కోసం వేరే ప్రాంతాలకు తరలి వెళ్లారన్నారు. డీఎస్సీ ద్వారా 50 వేల ఉపాధ్యాయ, దళితులు, బడుగు, బలహీన వర్గాలకు చెందిన బ్యాక్‌లాగ్‌ ఖాళీలు 1.60 లక్షల ఖాళీలను భర్తీ చేయాల్సి ఉన్నా ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తోందన్నారు. రాష్ట్రంలో 30 లక్షల మంది నిరుద్యోగ యువత ఉన్నారన్నారు. చిడిపి సర్పంచి పాలడుగుల లక్ష్మణరావు, వేగి చిన్నా, కోడూరి ప్రసాద్‌, కరుటూరి సతీష్‌, పొట్రు సిద్దూ తదితరులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని