logo

Kakinada: మాకు స్థలం ఇవ్వాలంటే.. ఎవరైనా మరణించాలంట..

గూ డులేని పేదలు ఇంటి స్థలం కోసం అర్జీ పెట్టుకున్న 90 రోజుల్లోనే మంజూరు చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి.

Updated : 18 Apr 2023 07:48 IST

గూడులేని పేదలు ఇంటి స్థలం కోసం అర్జీ పెట్టుకున్న 90 రోజుల్లోనే మంజూరు చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. కాకినాడ నగరం జగన్నాథపురంలోని కుంతీదేవిపేటకు చెందిన పలువురికి గతంలో చొల్లంగిలో ఇంటి స్థలాలు ఇస్తున్నట్లు పట్టాలు మంజూరు చేశారు. ఇప్పటికీ ఆ స్థలాన్ని వారికి అప్పగించలేదు. వారిలో కొందరు సోమవారం స్పందనలో కలెక్టర్‌ను కలసి సమస్యను వివరించారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ.. సచివాలయ సిబ్బందికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదన్నారు. ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డికి తమ గోడును వెళ్లబుచ్చుకోగా, ప్రస్తుత లబ్ధిదారుల్లో ఎవరైనా చనిపోతే వారి స్థలాన్ని మంజూరు చేస్తామని చెప్పారని వాపోయారు. 

ఈనాడు, కాకినాడ, న్యూస్‌టుడే, కాకినాడ కలెక్టరేట్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని