logo

ఒకే రోజు మూడు కాలాలు

నగరంలో ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు మూడు కాలాలను నగరవాసులు చవిచూశారు. ఉదయం ఎనిమిది గంటల వరకు మంచు కప్పేసింది.

Published : 29 May 2023 05:00 IST

హిమపాతం

ఉష్ణఘాతం

మేఘావృతం

మసీదుసెంటర్‌, సాంబమూర్తినగర్‌, న్యూస్‌టుడే: నగరంలో ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు మూడు కాలాలను నగరవాసులు చవిచూశారు. ఉదయం ఎనిమిది గంటల వరకు మంచు కప్పేసింది. మధ్యాహ్నం భానుడు ఉగ్రరూపం  దాల్చగా 44 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదైంది. ప్రధాన కూడళ్లు, మార్గాలు నిర్మానుష్యంగా మారాయి. మండుటెండ ఉక్కిరిబిక్కిరి చేసింది. సాయంత్రం ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమైంది. ఈదురుగాలులతో సాయంత్రం 4.30 గంటలకే కారుమబ్బులు కమ్ముకోవడంతో అంధకారం అలముకుంది. ఆ సమయంలో వాహనదారులు హెడ్‌లైట్లు వేసుకుని ముందుకు సాగారు. మెరుపులు, ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షంతో వాతావరణం చల్లబడింది. ఒకే రోజు మూడు కాలాల వాతావరణం అనుభవంలోకి రావడంతో పాటు సాయంత్రం శీతలగాలులతో నగరవాసులు ఉక్కపోత నుంచి సేదదీరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని