logo

నీళ్ల ట్యాంకు పైనుంచి దూకి వివాహిత ఆత్మహత్య

అత్తింట్లో శారీరక, మానసిక వేధింపులు తాళలేక ఓ వివాహిత బలవన్మరణానికి పాల్పడింది. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

Published : 29 May 2023 05:00 IST

సత్యవేణి (పాత చిత్రం)

కోరుకొండ: అత్తింట్లో శారీరక, మానసిక వేధింపులు తాళలేక ఓ వివాహిత బలవన్మరణానికి పాల్పడింది. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రాజానగరం మండలం పల్లకడియం గ్రామానికి చెందిన కడలి సత్యవేణి(27)కి కోరుకొండ మండలం గాడాల గ్రామానికి చెందిన కడలి మల్లికార్జునరావుతో ఏడాది కిందట వివాహమైంది. అతడు రాజమహేంద్రవరంలో బంగారు వస్తువుల తయారీ పని చేస్తుంటాడు. వివాహం అయినప్పటి నుంచి భర్త, అత్తమామలు వెంకటరమణ, సూర్య చక్రవతి అదనపు కట్నం తీసుకురావాలని సత్యవేణిని వేధించేవారు. ఈ క్రమంలో గాడాల నుంచి పాలచర్ల వెళ్లే రహదారిలోని 60 అడుగుల ఎత్తు ఉన్న నీళ్ల ట్యాంకుపై నుంచి దూకి ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. శనివారం ఉదయం నుంచి సత్యవేణి కనబడటం లేదని మృతురాలి తల్లిదండ్రులకు అల్లుడు సమాచారం ఇచ్చాడు. చుట్టుపక్కల ప్రాంతాల్లో బంధువులు గాలించగా.. గ్రామ శివారు ట్యాంకు వద్ద ఆమె మృతదేహాన్ని గుర్తించారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆదివారం మృతదేహానికి పంచనామా నిర్వహించారు. విగతజీవిగా మారిన కుమార్తెను చూసి తల్లిదండ్రులు చేబ్రోలు సత్యనారాయణ, కుమారి విలపించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని