అధికారిక లాంఛనాలతో దొమ్మేటి అంత్యక్రియలు
మాజీ ఎమ్మెల్యే దొమ్మేటి వెంకటేశ్వర్లు అంత్యక్రియలు మంగళవారం దుగ్గుదూరులో అధికారిక లాంఛనాలతో నిర్వహించారు.
దొమ్మేటి పార్థివదేహానికి నివాళి అర్పిస్తున్న నాయకులు
కాజులూరు: మాజీ ఎమ్మెల్యే దొమ్మేటి వెంకటేశ్వర్లు అంత్యక్రియలు మంగళవారం దుగ్గుదూరులో అధికారిక లాంఛనాలతో నిర్వహించారు. కొన్ని నెలలుగా అనారోగ్యంతో కాకినాడలోని ఫౌండేషన్ అసుపత్రిలో చికిత్స పొందుతున్న దొమ్మేటి సోమవారం రాత్రి 8.30 గంటల సమయంలో మృతిచెందారు. మృతదేహాన్ని మంగళవారం ఆయన స్వగ్రామమైన కాజులూరు మండలం దుగ్గుదూరు తీసుకొవచ్చారు. మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్, మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు, అమలాపురం మాజీ ఎంపీ జి.వి.హర్షకుమార్, మాజీ ఎమ్మెల్యే మేడిశెట్టి రామారావు, పలువురు తెదేపా, వైకాపా, జనసేన నాయకులు నివాళి అర్పించారు. అనంతరం పోలీసులు గౌరవవందనం సమర్పించారు. ఆయన పలు గ్రామాల్లో సాగు, తాగునీరు ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం చూపించారు. ప్రభుత్వాసుపత్రిలో పేదలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేశారు. ఆయనకు భార్య సుబ్బలక్ష్మి, కుమారుడు గిరీష్ కుమార్, కుమార్తె రజిని స్నేహలత ఉన్నారు. దొమ్మేటి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే సామర్లకోటలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కుమారుడు దుర్మరణం పాలయ్యాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
శాంతిస్థాపన సందేశంతో ముగిసిన ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాలు
-
Sudheer Babu: భూతద్దంతో ఈ సినిమాని చూడొద్దు: సుధీర్ బాబు విజ్ఞప్తి
-
Delhi: ఆ ముగ్గురు అనుమానిత ఉగ్రవాదులూ ఇంజినీర్లే.. బాంబుల తయారీలో నిష్ణాతులు
-
Atchannaidu: తలుపులు బద్దలు కొట్టి అరెస్టు చేసేంత నేరం బండారు ఏం చేశారు?: అచ్చెన్న
-
Guntur Kaaram: అందుకే పూజా హెగ్డేను రీప్లేస్ చేశాం: నిర్మాత నాగవంశీ
-
DGCA: పైలట్లు పెర్ఫ్యూమ్లు వాడొద్దు.. డీజీసీఏ ముసాయిదా!