logo

తమ్ముళ్లూ.. మీ సాహసం అభినందనీయం

మహానాడు వేళ వేమగిరి వద్ద జరిగిన బహిరంగ సభలో ఊహించని ప్రమాదాన్ని ధైర్యంగా ఎదుర్కొన్న యువకులను చంద్రబాబు మంగళవారం ట్విటర్‌ ద్వారా ప్రశంసించారు.

Updated : 31 May 2023 05:10 IST

ఆపద తప్పించిన యువకులకు చంద్రబాబు ప్రశంస

టి.నగర్‌ (రాజమహేంద్రవరం), న్యూస్‌టుడే: మహానాడు వేళ వేమగిరి వద్ద జరిగిన బహిరంగ సభలో ఊహించని ప్రమాదాన్ని ధైర్యంగా ఎదుర్కొన్న యువకులను చంద్రబాబు మంగళవారం ట్విటర్‌ ద్వారా ప్రశంసించారు. ఆ రోజు సభ వద్ద ఫ్లడ్‌ లైట్ల కోసం ఏర్పాటు చేసిన స్తంభం ఈదురుగాలులకు పడిపోయే పరిస్థితి ఏర్పడింది. అక్కడే ఉన్న పోలవరం మండలం కొత్త పట్టిసీమకు చెందిన బావమరుదులు విజయ్‌బాబు, రాజు ప్రాణాలకు తెగించి ఆ స్తంభాన్ని పట్టుకున్నారు. అక్కడ కూర్చొని ఉన్న సుమారు 300 మందిని దూరంగా వెళ్లిపోమని గట్టిగా అరిచారు. విద్యుత్తు తీగల రాపిడికి నిప్పు రవ్వలు ఎగసి పడడంతో ప్రమాదం జరుగుతుందని స్తంభాన్ని పక్కకు నెట్టారు. ఈ క్రమంలో వారు గాయపడ్డారు. ప్రస్తుతం వారిద్దరూ కోలుకుంటున్నారు. దీనిపై స్పందించిన చంద్రబాబు... ‘అక్కడ ఉన్న వారికి ఆపద రాకుండా ప్రాణాలకు తెగించి సాహసోపేతంగా వ్యవహరించినందుకు సెల్యూట్‌. ఈ ఘటనలో గాయపడిన మీరు త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నా...’ అంటూ ట్వీట్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని