logo

ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని నిరసన

ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం తక్షణం పరిష్కరించాలని ఏపీజేఏసీ జిల్లా కమిటీ డిమాండ్‌ చేసింది. ఏపీజేఏసీ అమరావతి మూడో దశ ఉద్యమ కార్యాచరణలో భాగంగా మంగళవారం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌

Updated : 31 May 2023 05:04 IST

కలెక్టరేట్‌ వద్ద దీక్షలో పాల్గొన్న ఉద్యోగ సంఘాల నాయకులు

వి.ఎల్‌.పురం, న్యూస్‌టుడే: ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం తక్షణం పరిష్కరించాలని ఏపీజేఏసీ జిల్లా కమిటీ డిమాండ్‌ చేసింది. ఏపీజేఏసీ అమరావతి మూడో దశ ఉద్యమ కార్యాచరణలో భాగంగా మంగళవారం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ వద్ద సామూహిక నిరాహార దీక్ష కార్యక్రమాన్ని చేపట్టారు. ఉద్యోగుల డిమాండ్లు పరిష్కరించేవరకు ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఏపీజేఏసీ జిల్లా కమిటీ అధ్యక్షుడు క్రాంతిప్రసాద్‌, ప్రధాన కార్యదర్శి శివకుమార్‌, అసోసియేట్‌ ఛైర్మన్‌ అహ్మద్‌, ఏపీ గెజిటెడ్‌ ప్రధానోపాధ్యాయ సంఘం నాయకుడు కోలా సత్యనారాయణ, మున్సిపల్‌ ఉపాధ్యాయ సంఘం నాయకుడు కెనడీబాబు, ఏపీ రెవెన్యూ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు బాపిరాజు, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం నాయకులు ఏపీజేఏసీ భాగస్వామ్య సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని