logo

బాలబాలాజీ కల్యాణం.. తిలకించ మహాభాగ్యం

పవిత్ర వైనతేయ నదీ తీరంలో కొలువైన అప్పనపల్లి బాలబాలాజీస్వామివారి దివ్య తిరు కల్యాణోత్సవాలు మంగళవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. అర్చకులు మద్దాలి తిరుమలశింగచార్యులు

Published : 31 May 2023 04:57 IST

స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు కల్యాణ తిలకం దిద్దుతున్న అర్చకులు

మామిడికుదురు, న్యూస్‌టుడే: పవిత్ర వైనతేయ నదీ తీరంలో కొలువైన అప్పనపల్లి బాలబాలాజీస్వామివారి దివ్య తిరు కల్యాణోత్సవాలు మంగళవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. అర్చకులు మద్దాలి తిరుమలశింగచార్యులు, గొడవర్తి శ్రీనివాసాచార్యులు తొలుత స్వామి, అమ్మవార్ల దివ్యమూర్తులను శోభాయమానంగా అలంకరించి వేదమంత్రోచ్చారణ, మంగళవాయిద్యాల నడుమ కల్యాణ తిలకం దిద్ది నూతన వధూవరులుగా తీర్చిదిద్దారు. అనంతరం జరిగిన పూజా కార్యక్రమంలో ధర్మకర్తల మండలి ఛైర్మన్‌ చిట్టూరి రామకృష్ణ, ఏసీ శ్రీరామవరప్రసాదరావు, ధర్మకర్తలు పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. సాయంత్రం పుట్టమన్ను తెచ్చి యాగశాలలోని నవ పాళికల్లో పోసి నవ ధాన్యాలు వేశారు. అంకురాలు బాగా చిగురించాలంటూ వేదపఠనంతో పూజలు చేసి అంకురార్పణ కార్యక్రమాన్ని వైదిక బృందం శాస్త్రోక్తంగా నిర్వహించింది. అగ్నిప్రతిష్ఠాపన చేసి హోమం జరిపారు. బుధవారం రాత్రి 9.15 గంటలకు జరిగే స్వామివారి కల్యాణోత్సవానికి  ఏర్పాట్ల్లు చేసినట్లు ఏసీ వరప్రసాదరావు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని