logo

తెదేపా మేనిఫెస్టోతో భరోసా

అయిదు కోట్ల ఆంధ్రుల భవిష్యత్తుకు భరోసా ఇస్తూ తెదేపా మహానాడులో చంద్రబాబునాయుడు ప్రకటించిన మేనిఫెస్టోలో అద్భుతమైన పథకాలున్నాయని మాజీ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు పేర్కొన్నారు.

Published : 31 May 2023 04:57 IST

అమలాపురంలో చంద్రబాబునాయుడు చిత్రపటానికి క్షీరాభిషేకం

అమలాపురం పట్టణం, న్యూస్‌టుడే: అయిదు కోట్ల ఆంధ్రుల భవిష్యత్తుకు భరోసా ఇస్తూ తెదేపా మహానాడులో చంద్రబాబునాయుడు ప్రకటించిన మేనిఫెస్టోలో అద్భుతమైన పథకాలున్నాయని మాజీ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు పేర్కొన్నారు. అమలాపురంలో జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు పెచ్చెట్టి విజయలక్ష్మి అధ్యక్షతన పార్టీ నాయకురాళ్లు, నాయకులు మంగళవారం సమావేశం నిర్వహించారు. మహిళా స్వావలంబనకు పెద్దపీట వేసిన చంద్రబాబునాయుడు చిత్రపటానికి తెలుగు మహిళలు, ఆనందరావు, మెట్ల రమణబాబు తదితరులు క్షీరాభిషేకం చేశారు. రమణబాబు మాట్లాడుతూ. నాశనమే తప్ప అభివృద్ధి ఎరుగని దుర్మార్గ వైకాపాను తరిమికొట్టి, తెదేపాకు ప్రజలు అధికారం కట్టబెడతారన్నారు. విజయలక్ష్మి మాట్లాడుతూ మహిళలకు ప్రకటించిన భవిష్యత్తు వరాలపై హర్షం వ్యక్తం చేశారు. మాజీ ఎంపీటీసీ సభ్యుడు రామాంజనేయులుకు నివాళి అర్పించారు. నాయకులు జగదీశ్వరి, జయలక్ష్మి, పూర్ణిమ, అనిత, పార్వతి, ప్రమీల, నాగమణి, శ్రీదేవి, వేణుగోపాలకృష్ణ, ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు