logo

కోనసీమ రైల్వేలైన్‌కు నిధులు కేటాయించాలి

కోనసీమ ప్రజల చిరకాల కోరికైన కోటిపల్లి-నరసాపురం రైల్వేలైను అందుబాటులోకి తెచ్చేలా చర్యలు తీసుకోవాలని జిల్లా పరిరక్షణ ఐక్య సమితి, కోనసీమ జేఏసీ నాయకులు విజ్ఞప్తి చేశారు.

Published : 01 Jun 2023 05:33 IST

మంత్రి పెద్దిరెడ్డికి వినతి ఇస్తున్న నాయకులు

అమలాపురం పట్టణం: కోనసీమ ప్రజల చిరకాల కోరికైన కోటిపల్లి-నరసాపురం రైల్వేలైను అందుబాటులోకి తెచ్చేలా చర్యలు తీసుకోవాలని జిల్లా పరిరక్షణ ఐక్య సమితి, కోనసీమ జేఏసీ నాయకులు విజ్ఞప్తి చేశారు.  ఈమేరకు గన్నవరం ఎయిర్‌పోర్టు వద్ద రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి, తాడేపల్లిలో ప్రభుత్వ ముఖ్యసలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి  బుధవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోనసీమ రైల్వేలైన్‌కు రాష్ట్ర ప్రభుత్వం 25శాతం రూ.350కోట్ల వాటా నిధులు విడుదల చేయాలని, భూసేకరణ వెంటనే చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ మాజీ ఛైర్మన్‌ నల్లా విష్ణు, నల్లా పవన్‌కుమార్‌, బీఆర్‌కే నాయుడు,  రామ్మోహనరావు, పర్తి దత్తుడు, రాజేంద్ర పాల్గొన్నారు.

 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని